మంత్ర‌గత్తెలు..చిన్నారిని త‌ల‌కిందులుగా క‌ట్టేసి, కింద మంట‌పెట్టారు! కోర్టులో..

వూడూ. అమెరికాలో ప్రాబ‌ల్యంలో ఉన్న ఓ క్షుద్ర‌పూజ‌. దీనికోసం అక్కాచెల్లెలు అయిదేళ్ల చిన్నారిని దారుణంగా హింసించారు.

క్షుద్ర‌శ‌క్తుల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డంలో భాగంగా చేసిన పూజ‌ల సంద‌ర్భంగా.. అయిదేళ్ల చిన్నారిని త‌ల‌కిందులుగా వేలాడదీసి, కింద మంట‌పెట్టారు.

ఈ ఘ‌ట‌న‌లో పాప ముఖానికి కాలిన గాయాల‌య్యాయి. ఆ ఇద్ద‌రు మంత్ర‌గ‌త్తెల పేర్లు పెగ్గి లాబోస్సిరి, రేఛ‌ల్ హిలైర్‌. అమెరికా మ‌సాచుసెట్స్ స్టేట్‌లోని ఈస్ట్ బ్రిడ్జివాట‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఈ ఘ‌ట‌న‌పై త‌ల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఇద్ద‌ర్నీ అరెస్టు చేశారు. న్యాయ‌స్థానంలో ప్ర‌వేశ‌పెట్టారు. విచార‌ణ కొన‌సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here