మూడురోజులుగా రోడ్డుప‌క్క‌న పార్క్ చేసి ఉన్న మారుతి వ్యాన్‌: అమ్మాయిల లోదుస్తులు, ర‌క్తం!

మూడురోజులుగా రోడ్డు ప‌క్క‌నే ప‌డిఉన్న ఓ మారుతి వ్యాన్ అది. వ్యాన్ గురించి ఆరా తీయ‌డానికి వెళ్లిన స్థానికులకు అందులో ర‌క్త‌పు మ‌ర‌క‌లు క‌నిపించాయి.

బ్యాక్‌సీట్ వెనుక‌భాగంలో ఉన్న ఖాళీ స్థ‌లంలో బ్రా, అండ‌ర్‌వేర్ ల‌భించాయి. దీనితో వారు స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఈ ఘ‌ట‌న బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలోని జ‌గ‌దీష్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు చేప‌ట్టిన ద‌ర్యాప్తులో షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

భోజ్‌పూర్ జిల్లాకు ఆనుకునే ఉన్న జ‌హానాబాద్ జిల్లాకు చెందిన జూలీకి 2012లో జ‌గ‌దీష్‌పూర్ గ్రామానికి చెందిన అర‌వింద్‌కుమార్‌తో వివాహ‌మైంది.

అర‌వింద్‌కుమార్ స్థానికంగా ఓ సైబ‌ర్ కేఫెను న‌డిపిస్తున్నాడు. పెళ్ల‌యి అయిదేళ్ల‌యిన‌ప్ప‌టికీ.. ఆమెకు సంతానం క‌ల‌గ‌లేదు. దీనితో అత్తింటివారు జూలీని త‌ర‌చు చిత్ర‌హింస‌ల‌కు గురి చేసేవారు.

తీవ్రంగా కొట్టేవారు. ఈ సంద‌ర్భంలోనే ఆమెను శుక్ర‌వారం సాయంత్రం పాట్న‌లో ఉండే బంధువుల ఇంటికి శుభ‌కార్యానికి వెళ్తూ మారుతివ్యాన్‌లో జూలీని ఎక్కించుకుని దాడి చేశార‌ని, ఈ సంద‌ర్భంగా ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటిన‌ట్టు పోలీసుల ద‌ర్యాప్తులో స్ప‌ష్ట‌మైంది.

త‌మ కోడ‌లిని స్పృహ త‌ప్పిన స్థితిలో జ‌గ‌దీష్‌పూర్ శివార్ల‌లో వ‌దిలేశార‌ని, అదే స‌మ‌యంలో కారు చెడిపోవ‌డంతో దాన్ని కూడా అక్క‌డే వ‌దిలేసి వెళ్లార‌ని పోలీసులు తెలిపారు. మారుతి వ్యాన్ అర‌వింద్‌కుమార్ తండ్రి మ‌ద‌న్‌కుమార్‌దేన‌ని తేలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here