ముగ్గురు మ‌హిళ‌ల‌ను ముగ్గులో దించాడు..బ్లాక్ మెయిల్ చేసి రూ.14 ల‌క్ష‌లు గుంజాడు!

చిక్‌మ‌గ‌ళూరు: కంటికి కాస్త న‌దురుగా క‌నిపించిన మ‌హిళ‌ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేయ‌డం, వారి నుంచి ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను గుంజ‌డ‌మే అత‌గాడి ప‌ని. ఇలా ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను మోస‌గించాడు. వారిద్దరూ వివాహితులే. వారితో స‌న్నిహితంగా క‌లిసి దిగిన ఫొటోలు, సెల్ఫీల‌ను అడ్డుగా పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి, ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసుకున్నాడు.

ఓ మ‌హిళ ధైర్యం చేసి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అత‌గాడి బండారం బ‌య‌ట‌పడింది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని చిక్‌మ‌గ‌ళూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మూడిగెరెకు చెందిన ఓ మ‌హిళ బెంగ‌ళూరులో కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నారు. బెంగ‌ళూరుకు చెందిన గౌరిశంక‌ర్ అనే యువ‌కుడితో ఫేస్‌బుక్ ద్వారా ప‌ర‌చియం ఏర్ప‌డింది.

ఆ పరిచ‌యం వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. గౌరిశంక‌ర్‌తో క‌లిసి ఆమె వేరే ప్రాంతాల‌కు కూడా వెళ్తుండేది. ఆ స‌మయంలో తీసుకున్న ఫొటోలు, సెల్ఫీల‌తో బ్లాక్ మెయిల్ చేయ‌డం మొద‌లు పెట్టాడ‌త‌ను.

దీనితో అత‌ను అడిగిన‌ప్పుడ‌ల్లా డ‌బ్బులిస్తుండేది. ఇలా 4 ల‌క్ష‌ల 85 వేల రూపాయ‌ల‌ను గుంజాడు. బెంగ‌ళూరు పీణ్య ప్రాంతంలో బ్యూటీపార్ల‌ర్ న‌డిపిస్తోన్న మైత్రేయ (పేరుమార్చాం) అనే మ‌హిళ‌తో పాటు డాక్ట‌ర్ బిరాద‌ర్ అనే మ‌హిళా డాక్ట‌ర్‌ను కూడా ఇదే విధంగా మోస‌గించాడు.

వారిద్ద‌రి నుంచి 9 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను గుంజాడు. ధైర్యం చేసిన బాధితుల్లో ఒక‌రు పీణ్యా పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డంతో అత‌ని గుట్టు ర‌ట్ట‌యింది. త‌న‌పై కేసు న‌మోదైన విష‌యం తెలియ‌గానే.. గౌరీశంక‌ర్ ప‌రార‌య్యాడు. అత‌ని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here