మ‌హిళ‌కు వాచ్‌మెన్ ప‌ని అప్ప‌గించారు..తెల్లారేస‌రికి గ్యాంగ్‌రేప్‌న‌కు గురై..మృత‌దేహంగా తేలింది!

ఓ మ‌హిళ‌కు వాచ్‌మెన్ ప‌నిని అప్ప‌గించిందో ప్రైవేటు సంస్థ యాజ‌మాన్యం. అదే ఆమెకు శాపంగా మారింది. గ్యాంగ్‌రేప్‌న‌కు గుర‌య్యారు. స‌మీపంలోని క్వారీ గుంత‌లో మృత‌దేహంగా తేలారు.

ఈ ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని సంత‌మాగులూరు మండ‌లం పాతమాగులూరుకు చెందిన క‌న‌క‌మ్మ స్థానిక వైష్ణ‌వి గ్రానైట్ సంస్థ‌లో కొంత‌కాలంగా వాచ్‌మెన్‌గా ప‌నిచేస్తున్నారు.

మంగ‌ళ‌వారం రాత్రి ఆమె దారుణంగా సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఎప్ప‌ట్లాగే ఆమె గ్రానైట్ క్వారీల వ‌ద్ద కాప‌లా కాయ‌డానికి వ‌చ్చారు. అదేరోజు రాత్రి గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

అనంత‌రం గొంతు నులిమి హ‌త‌మార్చారు. మృత‌దేహాన్ని స‌మీపంలోని క్వారీ గుంత‌లో ప‌డేశారు. బుధవారం ఉదయం మృత‌దేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మృత‌దేహం అర్ధ‌న‌గ్నంగా ఉండ‌టం, గాయాలు ఉండ‌టాన్ని బ‌ట్టి చూసి, గ్యాంగ్‌రేప్‌న‌కు గురై ఉంటుంద‌ని ప్రాథ‌మికంగా నిర్ధారించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here