కామ ద‌హ‌నం త‌ర్వాత విబూధి కోసం వెళ్లిన జ‌నం అక్క‌డి దృశ్యాన్ని చూసి బిగుసుకుపోయారు!

లక్నో: హోలీ పండుగ నాడు ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కాముడి ద‌హ‌నం కోసం గుట్ట‌గా పేర్చిన క‌ట్టెల్లో దాక్కున్న ఓ మ‌హిళ స‌జీవ ద‌హన‌మైంది. కాన్పూర్ జిల్లాలోని మూసాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని గులౌలీ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

 

కాముడి ద‌హ‌నం పూర్త‌యిన త‌రువాత విబూధి కోసం వెళ్లిన గ్రామ‌స్తుల‌కు మృత‌దేహం క‌నిపించ‌డంతో ఉలిక్కిప‌డ్డారు. ఈ విష‌యాన్ని వెంట‌నే మూసాన‌గ‌ర్ పోలీసుల‌కు తెలియ‌జేశారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆన‌వాళ్ల‌ను బ‌ట్టి మ‌హిళ‌దిగా తేల్చారు.

అనంత‌రం- ప‌రీక్ష నిర్వ‌హించ‌గా..మృత‌దేహంపై ఉన్న గుర్తుల‌ను బ‌ట్టి గులౌలీ గ్రామానికే చెందిన పుష్పేంద్ర సింగ్ భార్య సీమాదిగా నిర్ధారించారు. 35 సంవ‌త్స‌రాల సీమ మాన‌సిక ఆరోగ్యం స‌రిగ్గా ఉండేది కాద‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు.

ప‌ర‌ధ్యానంలో మునిగిపోయి ఉండేద‌ని అంటున్నారు. కామ‌ద‌హ‌నం నాడు కూడా ఆమె క‌ట్టెల గుట్ట మాటున కూర్చుని ఉంటుంద‌ని, దాన్ని గుర్తించి ఉండ‌ద‌ని అంటున్నారు.

సీమ మ‌ర‌ణం ప‌లు అనుమానాల‌ను లేవ‌నెత్తిన‌ప్ప‌టికీ.. వాటికి స‌రైన స‌మాధానాల‌ను కుటుంబ స‌భ్యులు ఇవ్వ‌ట్లేదు. ఇప్ప‌టికిప్పుడు తామేమీ చెప్ప‌లేమ‌ని పోలీసులు కూడా చెబుతున్నారు. పోస్ట్‌మార్ట‌మ్ నివేదిక అందిన త‌రువాతే స్పందిస్తామ‌ని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here