ఓ మ‌హిళ‌ను తోటి మ‌హిళ‌లే బ‌ట్ట‌లు ఊడ‌దీసి కొట్టారు..!

ఓ మ‌హిళ‌ను తోటి మ‌హిళ‌లే న‌డిబ‌జారులో బ‌ట్ట‌లు ఊడ‌దీసి కొట్టిన ఘ‌ట‌న ఇది. చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో చోటు చేసుకుంది.

ఈ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి సాక్షాత్తూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడే ఎమ్మెల్యే. ఆ కొట్టింది కూడా తెలుగుదేశం పార్టీ మ‌హిళా కార్య‌క‌ర్త‌లే అని చెబుతున్నారు.

జ‌న్మ‌భూమి స‌భ‌ల సంద‌ర్భంగా స్థానిక స‌మ‌స్య‌ల‌పై అధికారులు, జ‌న్మ‌భూమి క‌మిటీ నాయ‌కుల‌ను నిల‌దీయ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణ‌మని అంటున్నారు.

ఫిర్యాదు చేసిన మహిళను వివస్త్రను చేసి కిరాతకంగా కొట్టారు. బాధితురాలి పేరు ఉమ‌. కుప్పం నియోజకవర్గం ప‌రిధిలోని శాంతిపురం మండలం గుంజార్లపల్లిలో బుధ‌వారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

జ‌న్మ‌భూమి సభ‌లు పూర్త‌యిన త‌రువాత‌.. భాగ్య‌ల‌క్ష్మి అనే స్థానిక టీడీపీ నాయ‌కురాలు.. బాధితురాలిపై దాడికి దిగింది. త‌న వెంట ఇత‌ర మ‌హిళా కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకెళ్లింది.

బాధితురాలి ప‌ట్ల దౌర్జన్యానికి దిగింది. జన్మభూమి స‌భ‌ల్లో ఫిర్యాదు చేస్తావా అంటూ ఆవేశంతో ఉమ‌పై దాడికి దిగారు. బ‌ట్ట‌లు ఊడ‌దీసి కొట్టారు. రాళ్లతో తీవ్రంగా కొట్టారు.

ఈ దారుణాన్ని అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన ఉమ భ‌ర్త‌ను కూడా చితకబాదారు. స్థానికులు వారిని విడిపించారు. తీవ్రంగా గాయపడిన ఉమ‌ను ఆసుపత్రికి తరలించారు.

ఈ దాడిపై ఉమ భ‌ర్త రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here