త‌న చావుకు కార‌ణ‌మేంటో..చేతి మీద రాసుకుంది!

ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఓ మ‌హిళ స‌రిగ్గా వేలంటైన్స్ డే ముందు రోజు ఆత్మ‌హ‌త్య చేసుకుంది. త‌న చావుకు భ‌ర్త‌, ఆడ‌ప‌డుచు, అత్తామామ‌లే కార‌ణ‌మని ఆరోపించింది. త‌న చావుకు ఆ న‌లుగురే కార‌ణ‌మ‌ని అంటూ త‌న చేతి మీద రాసుకుంది.

త‌న మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాల‌ను కూడా ఆమె వివ‌రించింది. ఈ ఘ‌ట‌న హ‌ర్యానాలోని పంచ్‌కులా జిల్లా క‌ల్కాలో చోటు చేసుకుంది. మృతురాలి పేరు కౌస‌ల్య‌. 32 సంవ‌త్స‌రాల కౌస‌ల్య స‌రిగ్గా రెండున్న‌రేళ్ల కింద‌టే ప్రేమించి, పెళ్లి చేసుకుంది.

అత్తవారింట్లో అడుగు పెట్టాక గానీ ఆమెకు భ‌ర్త అస‌లు స్వ‌రూపం తెలిసి రాలేదు. అద‌న‌పు క‌ట్నం కోసం త‌న‌ను మాన‌సికంగా, శారీర‌కంగా హింసించే అత్తామామ‌లు, ఆడ‌ప‌డుచుకే భ‌ర్త వ‌త్తాసు ప‌లికాడ‌ని పేర్కొంది.

వారితో క‌లిసి భ‌ర్త కూడా త‌న‌ను కొట్టేవాడ‌ని కౌస‌ల్య చేతిపై రాసుకొచ్చింది. త‌న త‌ల్లిదండ్రుల మాట విని ఉంటే త‌న‌కు ఈ దుస్థితి ప‌ట్టేది కాద‌ని చెబుతూ ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. కౌస‌ల్య తండ్రి ప్లంబ‌ర్‌.

పెద్ద‌గా ఆర్థిక స్థోమ‌త లేకపోవ‌డం వ‌ల్ల క‌ట్నం ఆశించిన క‌ట్నం ఇవ్వ‌లేద‌ని, దీనితో త‌న భ‌ర్త‌, అత్తామామ‌లు హింసించే వార‌ని ఆమె రాసుకుంది. దీన్ని మ‌ర‌ణ వాంగ్మూలంగా తీసుకున్న పోలీసులు కౌస‌ల్య భ‌ర్త ప్ర‌మోద్‌, అత్తామామ‌లు, ఆడ‌ప‌డుచుపై కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here