నా చావుకు కార‌ణం.. !

ఒంగోలు: ఉన్న‌తాధికారిణి వేధింపుల‌ను భ‌రించ‌లేక కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఆత్మహత్యయత్నం చేశారు. ఆమె పేరు శివ‌పార్వ‌తి. ప్ర‌కాశం జిల్లా తాళ్లూరులోని క‌స్తూర్బాగాంధీ బాలిక‌ల ఉన్న‌త పాఠ‌శాల‌లో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌.

స్పెష‌ల్ ఆఫీస‌ర్ సుజిత త‌న‌ను వేధిస్తున్నార‌ని, ఆమె వేధింపుల‌ను భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు శివ‌పార్వ‌తి సెల్ఫీ వీడియోను విడుద‌ల చేశారు.

అనంత‌రం పెద్ద మొత్తంలో నిద్ర‌మాత్ర‌లు మింగారు. క‌స్తూర్బా గాంధీ పాఠ‌శాల‌లోనే ఆమె ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన తోటి ఉద్యోగులు ఆమెను హుటాహుటిన ఒంగోలు రిమ్స్‌కు త‌ర‌లించారు.

ప్ర‌స్తుతం శివ‌పార్వ‌తి అక్క‌డ చికిత్స పొందుతున్నారు. తన చావుకు కారణం స్పెషల్‌ ఆఫీసర్ సుజితనే కారణం అనే విష‌యాన్ని ఆమె రెండుసార్లు ప్ర‌స్తావించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here