చెరువులో స్నానానికంటూ వెళ్లింది..చెట్ల పొద‌ల్లో, అర్ధ‌న‌గ్నంగా!

చెరువులో స్నానం చేయడానికి బ‌య‌లుదేరిన ఓ మ‌హిళ ఇక మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి రాలేదు. దారుణ హ‌త్య‌కు గురైంది. ఆమె మృత‌దేహం చెట్ల పొద‌ల్లో, అర్ధ‌న‌గ్నంగా క‌నిపించింది. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని గంజాం జిల్లాలో చోటు చేసుకుంది. హ‌తురాలి పేరు ప్ర‌తిమా బెహెర‌.

జిల్లాలోని బెర్హంపూర్ స‌ద‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని బెండాళియా గ్రామానికి చెందిన మ‌హిళ‌గా గుర్తించారు. ఆమె వివాహితురాలు. త‌న భ‌ర్త‌, పిల్ల‌ల‌తోక‌లిసి బెండాళియాలో నివ‌సిస్తోంది. సోమ‌వారం ఉద‌యం చెరువులో స్నానం చేయ‌డానికి బ‌య‌లుదేరి వెళ్లింది.

మ‌ధ్యాహ్న‌మైన‌ప్ప‌టికీ తిరిగి రాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆమె కోసం వెదికారు. న‌దికి వెళ్లే మార్గంలో చెట్ల పొద‌ల్లో ఆమె మృత‌దేహం క‌నిపించింది. వెంట‌నే వారు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఒంటిపై బంగారు వ‌స్తువులు లేవు.

మృత‌దేహం అర్ధ‌న‌గ్నంగా క‌నిపించ‌డంతో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అత్యాచారం చేసి, హ‌త‌మార్చి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. మృత‌దేహం వ‌ద్ద చీర‌, బ‌కెట్ క‌నిపించాయి. ఈ ఘ‌ట‌న‌పై స‌ద‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here