రెండు గోనెసంచుల్లో దొరికిన మ‌హిళ మృత‌దేహం పోస్ట్‌మార్ట‌మ్ రిపోర్ట్: దాన్ని చూసి పోలీసులూ షాక్‌

హైద‌రాబాద్‌: న‌గ‌రంలోని కొండాపూర్ స‌మీపంలో ఉన్న బొటానిక‌ల్ గార్డెన్స్ గేటు స‌మీపంలో, రెండు గోనెసంచుల్లో దొరికిన మ‌హిళ మృత‌దేహం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వ‌చ్చింది.

ఆ మ‌హిళ నిండుగ‌ర్భిణి. ఈ విష‌యం పోస్ట్‌మార్ట‌మ్ నివేదిక‌లో తేలింది. ఎనిమిది నెల‌ల గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌ను ఎవ‌రు ఇంత దారుణంగా హ‌త‌మార్చార‌నేది ఇంకా తెలియ‌రాలేదు.

దీనిపై పోలీసులు ముమ్మ‌ర ద‌ర్యాప్తు చేస్తున్నారు. మ‌హిళ గ‌ర్భంలో మ‌గ‌బిడ్డ ఉన్న‌ట్టు పోస్ట్‌మార్ట‌మ్ రిపోర్ట్‌లో తేలింద‌ని పోలీసులు చెప్పారు.

ఇంత దారుణంగా ఎలా హ‌త్య చేసి ఉంటార‌ని పోలీసులు కూడా దిగ్భ్రాంతికి గుర‌వుతున్నారు. హ‌త్య‌కు ముందు ఆ మ‌హిళ‌ను దారుణంగా కొట్టి ఉంటార‌ని, శ‌రీరంలో ప‌లుచోట్ల ఎముకలు విరిగిపోయిన‌ట్టు రిపోర్ట్‌లో ఉంద‌ని, దీన్ని బ‌ట్టి చూస్తే హ‌త్య‌కు ముందు ఆ మ‌హిళ‌ను దారుణంగా కొట్టి ఉంటార‌ని అంటున్నారు.

కొండాపూర్ శ్రీ‌రామ్‌కాల‌నీ స‌మీపంలో బొటానిక‌ల్ గార్డెన్ గేటు స‌మీపంలో ల‌భించిన రెండు గోనెసంచుల్లో మ‌హిళ మృత‌దేహం ముక్క‌లుగా దొరికిన విష‌యం తెలిసిందే. మ‌హిళ త‌ల క‌నిపించింది.

దాని ప‌క్క‌నే ప‌డి ఉన్న ఇంకో గోనెసంచిలో మిగిలిన శ‌రీర భాగాలు ఉన్నాయి. మ‌హిళ మృత‌దేహాన్ని ముక్కలు ముక్క‌లుగా న‌రికి, ఈ రెండు గోనెసంచుల్లో కుక్కేశారు.

కాళ్లను నాలుగు ముక్కలు, రెండు చేతులను నాలుగు ముక్కలు చేశారు. తల, మొండెం వేరు చేశారు. ఒక బస్తాలో కాళ్లు, చేతులు, తల లభించాయి.

మొండాన్ని ప్లాస్టిక్‌ బ్యాగుల్లో పెట్టి ప్లాస్టర్‌తో ప్యాకింగ్‌ చేశారు. రెండు సంచుల‌తోపాటు సంఘ‌ట‌నాస్థ‌లం నుంచి కుర్తా, రెడ్‌ కలర్‌ పైజామా, గాజులు, చేతి ఉంగరాలను క్లూస్‌టీమ్‌ సేకరించిందని పోలీసులు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here