ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న మహిళలకు చాలా రిస్క్ పొంచి ఉందట..!

గుండెపోటు.. ఏ సమయంలో.. ఏ వయసు వారికి వస్తాయో కనుక్కోవడం చాలా కష్టం. ఇక మహిళల్లో కూడా హార్ట్ అటాక్ లు చాలా ఎక్కువయ్యాయి. ఇక తల్లి అయ్యే సమయంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడమే కాకుండా.. చాలా ఒత్తిడి లో కూడా ఉంటారు. అయితే ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తెలిసొచ్చిందేమిటంటే.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న మహిళలకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట..!

రీసర్చర్స్ చేసిన సర్వే ప్రకారం.. ఎక్కువ మంది పిల్లలు ఉంటే హార్ట్ అటాక్, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ లాంటి లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయిదుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే 40 శాతం హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందట. ఒకటి లేదా ఇద్దరు పిల్లలు ఉన్న మహిళల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవాళ్ళకు హార్ట్ అటాక్ పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ప్రెగ్నెన్సీ, పురిటినొప్పుల కారణంగా మహిళల గుండె మీద చాలా ఒత్తిడి కలిగి ఉంటుంది. ఆ తర్వాత పిల్లలను పెంచడం కూడా చాలా కష్టతరమైనదే.. దీంతో మహిళలు తమ ఆరోగ్యం మీద దృష్టి సారించడం కూడా కష్టమే..! ఇక అబార్షన్స్ జరిగిన మహిళలకు 60శాతం ఎక్కువగా హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here