మొద‌టి భ‌ర్త‌ను వదిలేసి.. మూడునెల‌ల కింద‌ట రెండో పెళ్లి! దీని ఫ‌లితం?

భ‌ర్త‌తో మ‌న‌స్ప‌ర్థ‌ల వ‌ల్ల విడాకులు తీసుకుందో మ‌హిళ‌. స‌రిగ్గా మూడు నెల‌ల కింద‌టే రెండో వివాహం చేసుకుంది. అంతా స‌వ్యంగా సాగుతోంద‌నుకున్న స‌మ‌యంలో.. ఆ మ‌హిళ దారుణ‌హ‌త్య‌కు గురైంది.

రెండో భ‌ర్తే ఆమెను హ‌త‌మార్చాడు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని హిమ్మ‌త్‌న‌గ‌ర్ జిల్లాలో చోటు చేసుకుంది. హ‌తురాలి పేరు జుహీజోషి. రాజ‌స్థాన్ బార్మ‌ర్‌కు చెందిన జుహీ హిమ్మ‌త్‌న‌గ‌ర్‌లో నివ‌సిస్తుండేవారు.

ఈ నెల 5వ తేదీ నుంచి ఆమె అదృశ్య‌మ‌య్యారు. దీనిపై ఆమె భ‌ర్త భ‌ర‌త్ సోని స్థానిక పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు కూడా చేశారు. రెండురోజులుగా జుహీ క‌నిపించ‌ట్లేదంటూ ఆయ‌న ఫిర్యాదు ఇచ్చారు.

రెండు రోజుల కింద‌ట హిమ్మ‌త్ న‌గ‌ర్ స‌మీపంలోని స‌ర్వాడ గ్రామంలో స‌గం కాలిన మృత‌దేహం క‌నిపించింది. భ‌ర‌త్ సోనీ ఇచ్చిన ఆన‌వాళ్ల‌తో గుర్తు తెలియ‌ని మ‌హిళ పోలిక‌లు స‌రిపోవ‌డంతో.. అది జుహీజోషీదిగా నిర్ధారించారు.

ద‌ర్యాప్తు సంద‌ర్భంగా పోలీసులు భ‌ర‌త్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సంద‌ర్భంగా అత‌ను పొంత‌న‌లేని స‌మాధానాల‌ను ఇవ్వ‌డంతో వారి అనుమానం బ‌ల‌ప‌డింది. భ‌ర‌త్‌ను ప‌ట్టుకుని త‌మ‌దైన శైలిలో విచారించ‌గా.. జుహీని త‌న సోద‌రుడితో క‌లిసి తానే హ‌త‌మార్చిన‌ట్లు అంగీక‌రించాడు. ఈ నెల 3వ తేదీన ఆమెను ఇంట్లోనే హ‌త‌మార్చి, స‌ర్వాడా గ్రామ శివార్ల‌లో మృత‌దేహాన్ని త‌గుల‌బెట్టాన‌ని అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here