లాడ్జిలో దిగిన ప్రియుడిని క‌లుసుకోవ‌డాకెళ్లిన ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి..బాత్‌రూమ్‌లో!

వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగిస్తోన్న ఓ మ‌హిళ త‌న ప్రియుడిని క‌లుసుకోవ‌డానికి లాడ్జికి వెళ్లింది. కొద్దిసేప‌టి త‌రువాత లాడ్జి గ‌ది బాత్‌రూమ్‌లో ఆమె, ఆమె ప్రియుడు ర‌క్త‌పుమ‌డుగులో క‌నిపించారు.

త‌న ప్రియురాలిని చంపి, అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటాడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని భ‌ర‌త్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

మృతుల పేర్లు న‌స్రూ, సంతోష్‌. జిల్లాలోని సార‌స్ ప‌ట్ట‌ణానికి చెందిన‌ న‌స్రూకు ఇదివ‌ర‌కే పెళ్ల‌యింది. ఆమెకు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా.

ఉత్త‌ర్‌ప్రదేశ్ మ‌థుర జిల్లా ర‌సూల్‌పురాకు చెందిన సంతోష్‌తో ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది.

ఇద్ద‌రి మ‌ధ్యా వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. సంతోష్ త‌ర‌చూ సార‌స్ ప‌ట్ట‌ణానికి వ‌చ్చేవాడు. ఎప్పుడూ దిగే ప్ర‌తాప్ ప్యాలెస్ హోట‌ల్ అండ్ లాడ్జిలోనే దిగేవాడు.

తాను వ‌చ్చిన‌ట్టు న‌స్రుకు ఫోన్ ద్వారా తెలియ‌జేశాడు. దీనితో ఆమె పిల్ల‌ల‌ను స్కూల్‌కు పంపించి, ప్ర‌తాప్ ప్యాలెస్ లాడ్జికి వెళ్లింది. వెళ్లిన అర‌గంట‌కే హ‌త్య‌కు గురైంది.

సంతోష్ ఆమెను తుపాకితో కాల్చి చంపి, తాను కూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై లాడ్జి సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌తో పాటు, ఓ నాటు తుపాకీని స్వాదీనం చేసుకున్నాడు. నస్రూ త‌ల‌లో రెండు బుల్లెట్లు దూసుకెళ్లిన‌ట్టు పోలీసులు గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here