భ‌ర్త అస‌హ‌జ సెక్స్‌తో వేధిస్తున్నాడ‌ని..క‌త్తిపీట‌తో!

అస‌హ‌జ సెక్స్‌తో రోజూ వేధిస్తున్నాడ‌నే కార‌ణంతో ఓ మ‌హిళ క‌ట్టుకున్న భ‌ర్త‌ను క‌డ‌తేర్చింది. మ‌ద్యం మ‌త్తులో గొడ‌వ ప‌డుతోన్న భ‌ర్త కుత్తుకను క‌త్తిపీట‌తో కోసేసింది.

ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని పెరంబ‌లూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వెప్ప‌న్‌థ‌ట్టై స‌మీపంలోని తొండ‌మాన్‌దురై గ్రామానికి చెందిన సెల్వరాజ్‌, భార్య లూర్థుమేరితో క‌లిసి నివ‌సిస్తున్నాడు.

వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సెల్వరాజ్ మ‌ద్యానికి బానిస అయ్యాడు. రోజూ మ‌ద్యం తాగి వ‌చ్చి.. అస‌హ‌జ సెక్స్ కావాలంటూ భార్య‌ను వేధింపుల‌కు గురి చేస్తుండేవాడు.

దీనికి ఆమె అంగీక‌రించేది కాదు. ఈ విష‌యమై తరచూ దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంటుండేది. బుధవారం రాత్రి కూడా సెల్వరాజ్‌ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యను లైంగికంగా వేధించాడు.

దీనికి ఆగ్రహించిన లూర్థుమేరి కత్తిపీటతో సెల్వరాజ్‌ని నరికింది. ఈ దాడిలో సెల్వరాజ్‌ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.

గురువారం ఉదయం లూర్థుమేరి అరుమ్బావూర్‌ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఇంటికి వెళ్లి.. సెల్వ‌రాజ్ మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here