షూటింగ్ స్పాట్‌లోనే కుమ్మేసింది!

బెంగ‌ళూరు: టీవీ సీరియ‌ల్ షూటింగ్ స్పాట్‌లోనే ఓ హెయిర్ స్టైలిస్ట్‌ను కుమ్మేసిన ఘ‌ట‌న ఇది. క‌ర్ణాట‌క‌లో ఓ టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్‌లో `ప‌త్తేదారి ప్ర‌తిభ‌` మెగా సీరియ‌ల్ ప్ర‌సార‌మౌతోంది. కొంత‌కాలంగా బెంగ‌ళూరు-క‌న‌క‌పుర మార్గంలో ఈ సీరియ‌ల్‌కు సంబంధించిన కొన్నిసీన్ల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

దీనికోసం క‌న‌క‌పుర‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సీరియ‌ల్ యూనిట్ నివ‌సిస్తోంది. కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించడానికి యూనిట్ మ‌రో ఇంటిని అద్దెకు తీసుకుంది. సురేష్ అనే హెయిర్ స్టైలిస్ట్ కూడా అదే యూనిట్‌లో ఉంటున్నాడు. శ‌నివారం ఉద‌యం ఆ ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చిన మ‌మ‌త అనే మ‌హిళ సురేష్‌పై దాడి చేసింది.

అత‌ణ్ని ప‌ట్టుకుని చెప్పుతో కొట్టింది. హ‌ఠాత్తుగా ఈ దాడి ఎందుకు జ‌రిగింద‌నే విష‌యం తెలియ రావ‌ట్లేదు. చిత్రం యూనిట్ మొత్తం అద్దె ఇంట్లోకి చెప్పులు వేసుకుని రావ‌డ‌మే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా మ‌మ‌త‌.. షూటింగ్ యూనిట్‌తో గొడ‌వ ప‌డి, ఆగ్ర‌హానికి గురై చెప్పుతో కొట్టింద‌నే అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here