పెళ్ల‌యిన మూడేళ్ల‌కే విడాకులు..ఇప్పుడు అదృశ్యం! ఎవ‌రి హ‌స్తం?

విశాఖ‌ప‌ట్నం: పెళ్ల‌యిన మూడేళ్ల‌కే భ‌ర్త నుంచి వేరు ప‌డిన ఓ మ‌హిళ అదృశ్య‌మ‌య్యారు. ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నం జిల్లా భీమిలిలో చోటు చేసుకుంది. భీమిలిలో నివ‌సించే భార‌తి అనే మ‌హిళ మూడు రోజులుగా క‌నిపించ‌ట్లేద‌ని ఆమె త‌ల్లి స్థానిక పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

కింద‌టి నెల 28వ తేదీన మార్కెట్‌కంటూ ఇంట్లో నుంచి బ‌య‌టికి వెళ్లిన త‌న కుమార్తె మ‌ళ్లీ తిరిగి రాలేద‌ని ఆమె పోలీసుల‌కు తెలియ‌జేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

అదృశ్య‌మైన మ‌హిళ కొద్దిరోజులుగా భీమిలిలోని వాణీ విద్యానికేతన్ ప్రాంతంలో తల్లితో నివసిస్తున్నారు. ఆమె వివాహితురాలు. మూడేళ్ల కింద‌ట రాజ్‌కుమార్‌ అనే యువ‌కుడితో పెళ్ల‌యింది. మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా కొద్దిరోజుల‌కే ఆమె విడాకులు తీసుకున్నారు. త‌ల్లితో క‌లిసి నివ‌సిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here