మా తల్లే.. 65లక్షల రూపాయల ఆభరణాలు చెత్తలోకి వేసేశావా.. తర్వాత ఏమైందంటే..!

అప్పుడప్పుడు అనుకోకుండా ఏవైనా మన వస్తువులను పోగొట్టుకుంటూ ఉంటాం.. కానీ అజాగ్రత్తతో వ్యవహరిస్తే మాత్రం చాలా బాధపడాల్సి ఉంటుంది. అట్లాంటాకు చెందిన ఓ మహిళకు అదే జరిగింది. ఏకంగా 1,00,000 అమెరికన్ డాలర్ల డైమండ్ ఆభరణాలను చెత్త లోకి వేసేసింది. భారత కరెన్సీలో 65 లక్షల పైమాటే..!

ఓ మహిళ తన దగ్గర ఉన్న వజ్రాల నగలను పొరపాటున చెత్త లోకి వేసేసింది. ఆ చెత్తను ఓ నల్లటి కవర్ లో వేసి మున్సిపాలిటీ వాళ్ళ కోసం బయట విడిచిపెట్టింది. చెత్త తీసుకొని వెళ్ళే వాళ్ళు వచ్చి ఆ బ్యాగును తమ వాహనంలో తీసుకొని వెళ్ళారు. కొద్ది సేపటికి ఆ మహిళకు తాను చేసిన పొరపాటు గుర్తుకు వచ్చింది. వెంటనే మున్సిపాలిటీ సిబ్బందికి సమాచారం అందించారు. ఒకే ఒక్క క్లూ ఇచ్చింది ఆమె.. అది ఏమిటంటే నల్లని బ్యాగు అని.. అది తప్ప వేరే సమాచారం ఏమీ లేదు. అయినప్పటికీ సిబ్బంది డంపింగ్ యార్డుకు చేరుకొని ఆమె చెప్పిన ఆభరణాల గురించి వెతకడం మొదలుపెట్టారు.

ప్రతిరోజూ అక్కడ మూడువందల టన్నులకు పైగా చెత్తను డంపింగ్ యార్డు లోకి తీసుకొని వస్తూ ఉంటారు. అలాంటిది ఆమె ఆభరణాలను వెతకడం చాలా కష్టంతో కూడుకున్నది. కానీ ఓ అయిదుగురు సిబ్బంది వెతకడం మొదలుపెట్టారు. దాదాపు మూడు గంటల పాటూ కష్టపడి మూడు డైమండ్ రింగ్ లతో పాటూ ఒక బ్రేస్ లెట్ ను బయటకు తీశారు. ఎలాగోలా దొరికాయి నా ఆభరణాలు అని ఆ మహిళ ఆనందించింది. అలాగే తనకు సహాయం చేసిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here