హ‌త్యాయ‌త్నం నుంచి త‌ప్పించుకోవ‌డానికి అర్ధ‌న‌గ్నంగా ప‌రుగెత్తిన మ‌హిళ‌

త‌న‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఓ మ‌హిళ కిలోమీట‌ర్ దూరం పాటు దుస్తుల్లేకుండా పరుగెత్తిన ఘ‌ట‌న ఇది. ర‌క్తం ఓడుతున్న శ‌రీరంతో, అర్ధ‌న‌గ్నంగా ప‌రుగెత్తుతున్న మ‌హిళ‌ను చూసి.. వ్య‌వ‌సాయ కూలీలు ఆదుకున్నారు.

పోలీసుల‌కు సమాచారం ఇచ్చారు. ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. బుర్హాన్‌పూర్‌కు చెందిన రాగిణి (పేరుమార్చాం) అనే మ‌హిళ వ్య‌వ‌సాయ కూలి.

పొలంలో ప‌నిచేస్తుండ‌గా.. స‌లీమ్‌పూర్ గ్రామానికి చెందిన బ‌క్షీ అనే వ్య‌క్తి ఆమెపై దాడి చేశాడు. క‌ర్ర‌తో దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర‌గాయాల‌య్యాయి. పెనుగులాట‌లో ఆమె అర్ధ‌న‌గ్నంగా త‌యార‌య్యారు.

అయిన‌ప్ప‌టికీ.. ప్రాణ‌భ‌యంతో అలాగే ప‌రుగెత్తారు. సుమారు కిలోమీట‌ర్ దూరం పాటు ఆమె ప‌రుగెత్తిన‌ప్ప‌టికీ.. బ‌క్షీ ఆమెను వ‌ద‌ల్లేదు. వెంట‌ప‌డ్డాడు.

చేతికి చిక్కిన‌ప్పుడ‌ల్లా క‌ర్ర‌తో కొట్టాడు. దీన్ని చూసిన స్థానికులు ఆమెను ఆదుకున్నారు. ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

కొంత‌కాలం నుంచీ బ‌క్షి త‌ర‌చూ రాగిణికి ఫోన్ చేస్తుండేవాడు. త‌న‌తో శారీర‌క సంబంధాన్ని పెట్టుకోవాల‌ని, లేక‌పోతే చంపేస్తానంటూ బెదిరించేవాడు. దీనితో ఆమె బ‌క్షిపై షికార్‌పూర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకున్న‌ప్ప‌టికీ.. దానికి ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు.

త‌న‌పై కేసు పెట్టింద‌నే కోపంతో బ‌క్షి.. ఆమెపై ప‌గ పెంచుకున్నాడు. ఒంట‌రిగా పొలంలో దొరికడంతో దాడికి దిగాడు. ఈ ఘ‌ట‌న త‌రువాత అత‌ను ప‌రార‌య్యాడు. బ‌క్షి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here