ప‌శువుల పాక‌లో మ‌హిళ మృత‌దేహం!

శ్రీ‌కాకుళం: జిల్లాలోని భామిని మండ‌లంలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మండ‌లంలోని వ‌డ్డంగిగూడ తండాకు చెందిన గిరిజ‌న మ‌హిళ హ‌త్య‌కు గుర‌య్యారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అత్యాచారం చేసి, హ‌త‌మార్చి ఉంటార‌ని అనుమానిస్తున్నారు.

 

హ‌తురాలి పేరు గౌత‌మి. ఆంధ్ర‌-ఒడిశా స‌రిహ‌ద్దుల్లోని రాయ‌గ‌డ ఆమె స్వ‌స్థ‌లం. నాలుగేళ్ల కింద‌ట వ‌డ్డండిగూడ‌కు చెందిన మ‌నోహ‌ర్‌ను పెళ్లి చేసుకున్నారు. గేదెలు, మేక‌ల పెంప‌కం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

వ‌డ్డంగిగూడ గ్రామ శివార్ల‌లోని జీడితోట వద్ద పశువుల పాకను నిర్మించుకున్నారు. ఎక్కువ స‌మ‌యం అక్క‌డే గడుపుతారు. గురువారం మనోహర్ మండ‌ల కేంద్రం భామినికి వెళ్లాడు. దీనితో ప‌శువుల‌ను మేప‌డానికి ఒంట‌రిగా వెళ్లింది గౌత‌మి.

 

ఆ స‌మ‌యంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఆమెపై లైంగిక దాడి చేసి ఉంటాడ‌ని అనుమానిస్తున్నారు. గౌతమి చెవి దగ్గర రక్తపు మ‌ర‌క‌లు ఉన్నాయి. తల, ఇతర భాగాలకు గాయాల‌య్యాయి. దీన్ని బ‌ట్టి ఎవ‌రైనా హ‌త్య చేసి ఉంటార‌ని సందేహాలు వ్య‌క్త‌మౌతున్నాయి.

 

వడ్డంగిగూడ నుంచి మూలగూడకు వెళ్లే మార్గంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. అటుగా వెళ్తున్న కొంద‌రు మ‌హిళ‌లు గౌత‌మిని చూసి, కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం ఇచ్చారు.

స‌మాచారం తెలిసిన వెంట‌నే మ‌నోహ‌ర్ సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నాడు. భార్య మ‌ర‌ణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యాడు. ఈ ఘటనపై బత్తిలి పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. అనుమానాస్ప‌ద మృతి కింద కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here