న‌వ‌వ‌ధువు అనుమానాస్ప‌ద మృతి: హ‌డావుడిగా అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు..చివ‌రి నిమిషంలో!

ఓ న‌వ‌వ‌ధువు అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారు. ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో ఆమె క‌నిపించ‌గా.. భ‌ర్త‌, అత్తామ‌మ‌, ఆడ‌ప‌డ‌చు కూడ‌బ‌లుక్కుని ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని చెప్పారు. హ‌డావుడిగా అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు చేశారు.

మృత‌దేహాన్ని పాడెపైనా ఎక్కించారు. అదే స‌మ‌యంలో పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేశారు. అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకున్నారు. మృత‌దేహాన్ని పోస్ట్‌మార్ట‌మ్ కోసం త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నంలో చోటు చేసుకుంది.

మృతురాలి పేరు సంధ్య‌. వ‌య‌స్సు 19 సంవ‌త్స‌రాలు. జిల్లాలోని చోడవరం మండలం నరసయ్యపేటకు సంధ్య, బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట గ్రామానికి చెందిన చెందిన రాజుతో గత ఏడాది అక్టోబర్‌లో వివాహమైంది.

రాజు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కాంట్రాక్టు వర్కర్‌. గాజువాకలో అద్దె ఇంట్లో రాజు, సంధ్య కొత్త కాపురం పెట్టారు. అద‌న‌పు క‌ట్నం కోసం భ‌ర్త త‌న‌ను వేధిస్తున్నాడ‌ని, పెళ్ల‌యిన నెల‌రోజుల నుంచే ఈ వేధింపులు మొద‌ల‌య్యాయ‌ని సంధ్య త‌న త‌ల్లిదండ్రుల‌కు చెబుతుండేదట‌.

ఈ గొడ‌వ‌ల నేప‌థ్యంలో.. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో సంధ్య ఫ్యాన్‌కు ఊరేసుకొని కనిపించింది.
స్థానికుల సహాయంతో ఆపస్మారక స్థితిలో ఉన్న సంధ్య‌ను ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా చనిపోయిందని రాజు చెబుతున్నాడు.

ఇదే విష‌యాన్ని సంధ్య త‌ల్లిదండ్రుల‌కు చెప్పాడు. సంధ్య ఒంటిపైన గాయాలు, చేయి విరిగినట్టు ఉండడంతో భర్తే చంపాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

 

బుచ్చెయ్యపేట పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు రాజును అదుపులోకి తీసుకొన్నారు. సంధ్య మృత దేహాన్ని విశాఖ కేజిహెచ్‌కు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here