ప్రేమ‌వివాహం: 5వ అంత‌స్తు నుంచి ప‌డి యువ‌తి మృతి: పెంపుడుకుక్క తోసేసింద‌ట‌!

తమ‌ కుమారుడు ప్రేమ‌వివాహం చేసుకోవ‌డం అత‌ని త‌ల్లిదండ్రుల‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. పెళ్లికి వారు వెళ్ల‌లేదు కూడా. అయిన‌ప్ప‌టికీ.. భ‌ర్త‌ను న‌మ్ముకుని అత్తింట్లోకి అడుగు పెట్టిందా యువ‌తి.

త‌నంటే ఏ మాత్రం ఇష్టం లేని అత్తామామ‌లు, ఇత‌ర కుటుంబ స‌భ్యుల మ‌ధ్య రెండున్న‌రేళ్ల పాటు జీవితాన్ని కొన‌సాగించారు. కూకట్‌ప‌ల్లిలో అత్తింటివారితో క‌లిసి నివ‌సిస్తోన్న అపార్ట్‌మెంట్ అయిదో అంత‌స్తు నుంచి కింద‌ప‌డి దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.

 

దీనికి భ‌ర్తే కాదు అత్తామామ‌లు కూడా కామ‌న్‌గా చెబుతోన్న రీజ‌న్ ఒక్క‌టే.. పెంపుడు కుక్క‌తో ఆడుకుంటుండ‌గా టెర్ర‌స్ మీది నుంచి కింద‌ప‌డి మ‌ర‌ణిచింద‌ని.

ఆ యువ‌తి పేరు లాడ్లీ. రాజ‌స్థానీ అమ్మాయి. ఉన్న‌త చ‌దువులు చ‌దివారు. ప్ర‌తిష్ఠాత్మ‌క అమేజాన్ సంస్థ‌లో ఉద్యోగం చేస్తున్నారు. సాయిప్ర‌సాద్ ముదిరాజ్ అనే యువ‌కుడిని ప్రేమించి, 2015లో పెళ్లి చేసుకున్నారు.

ఈ వివాహాన్ని సాయిప్ర‌సాద్ త‌ల్లిదండ్రులు అంగీక‌రించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ.. ఆమె ధైర్యంగానే అత్తింట్లో అడుగుపెట్టారు. కూకట్‌పల్లిలో ఉన్న శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.

తెల్ల‌వారు జామున మూడున్న‌ర గంట‌ల స‌మ‌యంలో పెంపుడు కుక్క‌తో ఆడుకుంటూ వెళ్లి, అది మీద ప‌డ‌టంతో కింద‌ప‌డి మ‌ర‌ణించింద‌ని సాయిప్ర‌సాద్ చెబుతున్నాడు. లాడ్లీ కుటుంబ సభ్యులు మాత్రం వారు చెప్పేదంతా అబద్ధమని అంటున్నారు. తమ కూతురిని చంపేశార‌ని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here