క‌నుబొమ్మ‌లకు టాటూ లిక్విడ్ వేసుకుంది..ఇలా త‌యారైంది!

యువ‌తులు ఎంత అందంగా ఉన్నాస‌రే.. ఇంకా అందంగా క‌నిపించ‌డానికి లేని, పోని ప్ర‌యోగాలు చేస్తుంటారు. అన్ని సంద‌ర్బాల్లోనూ కాదు గానీ.. కొన్ని కొన్ని సార్లు మాత్రం అవి బెడిసి కొడుతుంటాయి.

ఆ ఫ‌లితాలు ఒక్కోసారి ఒక్కో ర‌కంగా ఉంటాయి. ఈవిడ విష‌యంలో మాత్రం..దాని ఇంపాక్ట్ ఇలా మారింది. న‌ల్ల‌టి ఐబ్రో టాటూ లిక్విడ్ స్టెయిన‌ర్‌ను ద‌ట్టంగా క‌నుబొమ్మ‌ల‌కు పూసుకుంది. కొద్దిసేప‌టి త‌రువాత దాన్ని తొల‌గించ‌డానికి రెడీ అయ్యింది.

దీన్ని సెల్ఫీ వీడియో తీస్తూ.. ఓ తెల్ల‌టి గుడ్డతో క‌నుబొమ్మ‌ల‌కు రుద్దుకున్న టాటూ లిక్విడ్‌ను తుడ‌వ‌బోతుండ‌గా.. షాక్ కొట్టినంత ప‌నైంది. ఎందుకంటే.. టాటూ లిక్విడ్‌తో పాటు మొత్తం క‌నుబొమ్మ‌లు మొత్తం తుడిచి పెట్టుకుపోయాయి.

దిగ్భ్రాంత పోవ‌డం ఆమె వంతైంది. మ‌రో క‌నుబొమ్మ‌కు రాసుకున్న టాటూ లిక్విడ్‌ను తొల‌గించ‌గా.. అదీ అలాగే మారింది. రెండు క‌నుబొమ్మ‌లూ తొల‌గిపోయాయి.

భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ అవి వ‌స్తాయో, రావో తెలియ‌దని వాపోతోందామె. ఆ మ‌హిళ వివ‌రాలేవీ తెలియరావ‌ట్లేదు గానీ.. లండ‌న్‌లో తీసిన‌ట్టుగా చెబుతున్నారు. నాసిర‌కం స్టెయిన‌ర్ల‌ను వాడ‌టం వ‌ల్లే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అంటోందామె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here