ఎంత‌మాట‌! గ‌ర్భిణులు జీన్స్ వేసుకుంటే..బిడ్డ‌లు న‌పుంస‌కులుగా మారుతార‌ట!

తిరువ‌నంత‌పురం: గ‌ర్భిణులు జీన్స్ ప్యాంట్‌, జీన్స్ ష‌ర్ట్స్ ధ‌రిస్తే..పుట్ట‌బోయే బిడ్డ‌లు నపుంస‌కులుగా పుడ‌తార‌ని సెల‌విచ్చారో పెద్దాయన‌. ఆయ‌న ఏదో దారిన పోయే దాన‌య్యేమీ కాదు. ప్రొఫెసర్‌. డాక్ట‌రేట్ అందుకున్న ప్రొఫెస‌ర్‌. డాక్ట‌ర్ ర‌జిత్ కుమార్‌. ఈ స్టేట్‌మెంట్ ఇచ్చింది ఆయ‌నే.

కేర‌ళ‌కు చెందిన ర‌జిత్ కుమార్ మంగ‌ళ‌వారం ఓ స‌ద‌స్సులో ప్ర‌సంగించారు. గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు మ‌హిళ‌లు మ‌గ‌వారిలాగా వ‌స్త్రాల‌ను ధ‌రించ‌డం స‌రికాద‌ని ఆయ‌న చెప్పారు. జీన్స్ వేసుకుని, మ‌గ‌వారిలాగా వ‌స్త్ర‌ధార‌ణ చేస్తే.. పుట్ట‌బోయే పిల్ల‌లు న‌పుంస‌కులుగా మారుతార‌ని అన్నారు.

ఇప్ప‌టికే కేర‌ళ‌లో ఆరు ల‌క్ష‌ల మంది న‌పుంస‌కులు జ‌న్మించార‌నీ అన్నారు. మహిళలు జీన్స్ ధరించడం వల్లనే వారికి పుట్టబోయే ఆడ పిల్లలు పురుషుడి లక్షణాలతో పుడుతున్నారని పేర్కొన్నారు. దీంతో వారు ట్రాన్స్‌జెండర్లుగా మారుతున్నారని, ఆటిజం వ్యాధితో బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు.

తల్లులు పురుషుల్లా వ్యవహరించడమే ఇందుకు కారణం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్యలు కేర‌ళ‌లో పెనుదుమారం రేపుతున్నాయి. మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళ‌న‌లు చేప‌ట్టాయి. ఆయ‌న‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక నుంచి ఏ కార్యక్రమానికి రజిత్ కుమార్‌ను ఆహ్వానించొద్దని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శైలజ.. అన్ని ప్రభుత్వ సంస్థలకు, కార్యాలయాలకు ఆదేశాలు ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here