పే..ద్ద నాగుపాము..భారీ కొండ‌చిలువ బిగ్ ఫైట్‌: చివ‌రికి..!

పేద్ద నాగుపాము. మామూలుగా కంటే పెద్ద‌గా ఉంది అది. దాని విషం అత్యంత ప్ర‌మాద‌క‌రం. ఒక్క కాటు ప‌డితే..అంతే సంగ‌తులు. కొండ‌చిలువ‌..బ‌ల‌మే ఆయుధం. బ‌ల‌మైన జంతువుల‌ను కూడా గుట‌కాయ స్వాహా చేసేంత శ‌క్తి ఉంటుంది కొండ‌చిలువ‌కు.

ఈ రెండు ఒక‌దానికొక‌టి ఎదురుప‌డ్డాయి. ఎవ‌రి దారిన అవి పోలేదు. కోపంగా చూసుకుంటూ, బుస‌లు కొడుతూ త‌ల‌ప‌డ్డాయి. భీక‌రంగా పోట్లాడుకున్నాయి. ఈ రెండిటి మధ్య హోరా హోరి పోరు కొన‌సాగింది. రెండూ వెన‌క్కి త‌గ్గ‌లేదు. నాగుపాము విషాన్ని చిమ్మితే.. కొండ‌చిలువ త‌న బ‌లంతో నాగుపామును చుట్టేసింది. ఈ భీకర పోరులో చివ‌రికి రెండూ మృత్యువాత ప‌డ్డాయి.

ఈ పోట్లాట‌కు సంబంధించి ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ పోరు ఎక్క‌డ సాగింద‌న‌డానికి స‌రైన స‌మాధానం దొర‌క‌ట్లేదు గానీ.. ఆగ్నేయాసియా దేశాల్లో ఒక‌టైన వియ‌త్నాంలో చోటు చేసుకుని ఉండొచ్చ‌ని అంటున్నారు. ఎందుకంటే.. స‌హ‌జ‌త్వానికి విరుద్ధంగా అతిపెద్ద నాగుపాములు ఆ దేశపు అడ‌వుల్లోనే ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here