అబ్బాయి, అమ్మాయి మ‌ధ్య రెజ్లింగ్‌..జింగ్‌..జింగ్‌!

ఇద్ద‌రు అబ్బాయిల మ‌ధ్య కుస్తీ పోటీలు చూశాం. ఇద్ద‌ర‌మ్మాయిలు కూడా బ‌రిలో దిగి సిగ‌ప‌ట్లు ప‌ట్టుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

ఈ కుస్తీ పోటీ మాత్రం వాట‌న్నింటికీ డిఫ‌రెంట్‌. ఓ అబ్బాయి, అమ్మాయి మ‌ధ్య కుస్తీ పోటీ ఇది. ఈ త‌ర‌హా మ‌ల్ల‌యుద్ధం బ‌హుశా ఇదే తొలిసారి అనుకోవ‌చ్చు.

మ‌హారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఈ మ‌ల్ల‌యుద్ధ పోటీ జ‌రిగిన‌ట్టు చెబుతున్నారు. అప్ప‌టికే ఇద్ద‌ర్ని ఓడించిన మ‌ల్ల‌యోధుడిని.. ఓ అమ్మాయి మ‌ట్టి క‌రిపించింది.

అచ్చం.. దంగ‌ల్ సినిమా త‌ర‌హాలో సాగింది ఇద్ద‌రి మ‌ధ్యా పోటీ. ఈ పోటీకి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

లాతూర్ జిల్లాలో మ‌రాఠాల సాంస్కృతికోత్స‌వాల సంద‌ర్భంగా ఓ గ్రామంలో ఈ పోటీని నిర్వ‌హించారు. దీన్ని తిల‌కించ‌డానికి గ్రామం మొత్తం త‌ర‌లివ‌చ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here