ఇప్పటికే రెండు వన్డేల్లో చిత్తు చిత్తుగా ఓడారు.. ఇప్పుడు దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ..!

సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం భారత్ వన్డేల్లో మాత్రం అదరగొడుతోంది. మొదటి రెండు మ్యాచుల్లో సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. ఇక సౌత్ ఆఫ్రికా పరిస్థితి ఏమీ అంత బాగా లేదు. ఇప్పటికే డివిలియర్స్ మొదటి మూడు వన్డేలకు దూరం అయ్యాడు. ఇక మొదటి వన్డేలో సెంచరీ కొట్టిన కెప్టెన్ డుప్లెసిస్ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ దశలో దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

తాజాగా గాయం కారణంగా వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ కూడా భారత్‌తో జరగనున్న మిగతా వన్డే, టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో డీకాక్ ఎడమ చేతి మణికట్టుకు తీవ్ర గాయమైందని దక్షిణాఫ్రికా మేనేజర్ మొహమ్మద్ మూసాజీ తెలిపారు. ఇటువంటి గాయాలకు దాదాపు 2-4వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. ఇక ఈ సిరీస్ లో ఎక్కడ కూడా డికాక్ పెద్దగా ప్రభావం చూపలేదు. మార్చి 1న ఆస్ట్రేలియాతో సౌత్ ఆఫ్రికా మొదటి టెస్టు ఆడనుంది.. అప్పటి లోగా డికాక్ కోలుకుంటాడని జట్టు యాజమాన్యం భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here