పిల్లాడి గొంతులో ఇరుక్కున్న ద్రాక్ష‌..! దాన్ని తీయ‌డానికి

మెల్‌బోర్న్‌: ఆహారాన్ని న‌మిలి మింగాలి అనేది ప్రాథ‌మిక సూత్రం. కాదు, కూడ‌దంటే మాత్రం దాని ఎఫెక్ట్ కాస్త గ‌ట్టిగానే క‌నిపిస్తుంది. ద్రాక్ష పండ్ల‌ను న‌మిలి మింగితేనే దాని టేస్ట్ ఏమిటో తెలుస్తుంది. అలా కాకుండా గుటుక్కున మింగితే దాని టేస్టూ ఉండ‌దు.

 

గోళీలా ఉండే ఆ ద్రాక్ష పండు ఎక్క‌డైనా ఇరుక్కుంటే ఇక అంతే సంగ‌తులు. ఈ ఉదంతం కూడా ఇలాంటిదే. అయిదేళ్ల పిల్లాడొక‌డు ద్రాక్ష‌ను న‌మ‌ల‌కుండా మింగేశాడు. అది నేరుగా లోనికి వెళ్ల‌లేదు. గొంతుకు అడ్డం ప‌డింది.

 

ఏ రేంజ్‌లో అది అడ్డం ప‌డిందో.. ఆ ద్రాక్ష పండు ఎక్క‌డ ఇరుక్కుందో ఈ ఎక్స్ రే స్ప‌ష్టంగా తేల్చి చెబుతోంది. గొంతుకు అడ్డం ప‌డ‌టంతో ఆ పిల్లాడు ఊపిరి పీల్చుకోవ‌డానికి నానా తంటాలూ ప‌డ్డాడు.

దీనితో తల్లిదండ్రులు వెంట‌నే అత‌న్ని ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా.. ఆప‌రేష‌న్ చేసి, దాన్ని బ‌య‌టికి తీయాల్సి వ‌చ్చింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది. ఆ పిల్లాడి పేరు, ఇత‌ర వివ‌రాలేవీ తెలియ‌రావ‌ట్లేదు గానీ.. ఏంజెలా హెండ‌ర్స‌న్ అనే మ‌హిళ ఆ పిల్లాడి ఎక్స్‌రే ఫొటోను త‌న బ్లాగ్‌లో ఉంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here