`ఎంత స‌క్కగున్నావే..` ఇంత స‌క్క‌గ ఎలా తీశారో!

హైద‌రాబాద్‌: ఈ మ‌ధ్య‌కాలంలో ట్రెండింగ్‌లో నిలిచిన పాట `ఎంత స‌క్క‌గున్నావే..`. ఈ పాటను యూట్యూబ్‌లో విడుద‌ల చేసిన‌ప్ప‌టి నుంచీ హ్యూజ్ వ్యూస్‌ను సంపాదించింది. ట్రెండింగ్‌లో నిలిచింది. తాజాగా చిత్రం యూనిట్ ఈ పాట మేకింగ్ వీడియోను విడుద‌ల చేసింది.

రామ్‌చరణ్‌, సమంత మీద చిత్రీక‌రించారీ పాట‌ను. చంద్ర‌బోస్ రాసిన ఈ పాట‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య రీతుల‌ను స‌మ‌కూర్చారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందించారు. గోదావ‌రి న‌ది, మొక్క జొన్న తోట‌లో ఎక్కువ భాగం చిత్రీక‌రించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here