అబ్బాయిలు, అమ్మాయి క‌నిపించ‌డ‌మే ఆల‌స్యం..!

గౌత‌మ్‌బుద్ధ న‌గ‌ర్‌: ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కొందరు యువకులు దురాగ‌తానికి పాల్ప‌డ్డారు. ప‌ట్ట‌ప‌గ‌లు బ‌రి తెగించారు. ఇద్ద‌రు యువ‌కులు, ఓ యువ‌తిపై దాడి చేశారు. విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టారు. క‌ర్ర‌లు తీసుకుని చావ‌బాదారు.

దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని గౌతమ్‌బుద్ధనగర్‌లో చోటు చేసుకుంది. మోర‌ల్ పోలీసింగ్ వ్య‌వ‌స్థే దీనికి కార‌ణ‌మని భావిస్తున్నారు.

న‌గ‌ర శివార్ల‌లో ఇద్దరు యువకులు, బ్యాగ్‌తో ఉన్న ఓ యువతి కాలిన‌డ‌క‌న వెళ్తుండ‌గా.. కొంద‌రు యువ‌కులు వారిని చుట్టుముట్టారు. అట‌కాయించారు. ఎక్క‌డికెళ్తున్నారు? ఏం చేస్తున్నారంటూ నిల‌దీశారు.

వారు చెప్పే స‌మాధానాల‌ను కూడా విన‌కుండా కర్రలు, చెరుకు గెడ‌ల‌తో చిత‌గ్గొట్టారు. కింద‌టి నెల 1వ తేదీన ఈ ఘటన చోటు చేసుకున్న‌ట్టు చెబుతున్నారు.

దీనిపై బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ దాడుల వ్య‌వ‌హారం రెండురోజుల కింద‌ట వెలుగులోకి వ‌చ్చింది. కొత్త సంవత్సర వేడుక‌ల కోసం తాము వెళ్తుండ‌గా.. మార్గ‌మ‌ధ్య‌లో కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు త‌మ‌ను అడ్డ‌గించార‌ని బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

విచక్ష‌ణార‌హితంగా కొట్టార‌ని, తమతో ఉన్న అమ్మాయిని కూడా వేధించార‌ని చెప్పారు. ఆమెను కూడా చావు దెబ్బలు కొట్టారని ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామ‌ని పోలీసులు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here