అంద‌రూ చూస్తుండ‌గా..కేక‌లు వేస్తూ అడ్డుకుంటుండ‌గా..రైలు కింద‌

యాదాద్రి భువ‌న‌గిరి: జిల్లాలో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌మ పెళ్లికి రెండు కుటుంబాల వారూ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ప్రేమికులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. రైలు కింద ప‌డి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. జిల్లాలోని రామన్నపేట స‌మీపంలో ఈ ఘ‌ట‌న సంభ‌వించింది.

మృతులను నల్గొండ జిల్లా నార్కట్‌ పల్లి మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గణేష్‌, పూజితగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప‌ట్టాల‌పై ప‌డుకున్న వారిద్ద‌రినీ తాము చూశామ‌ని, ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌ద్దంటూ తాము కేక‌లు వేస్తూ గ‌ట్టిగా అరుస్తున్న‌ప్ప‌టికీ.. వినిపించుకోలేద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here