మ‌ర‌ద‌లు వేరొక‌ర్ని పెళ్లి చేసుకుంటోంద‌ని..ఫొటో మార్ఫింగ్ చేసి కాబోయే భ‌ర్త‌కు పంపాడు!

వ‌రంగ‌ల్‌: త‌న మ‌ర‌ద‌లు వేరొక‌ర్ని పెళ్లి చేసుకుంటోంద‌నే ఆగ్ర‌హంతో ర‌గిలిపోయాడో కిరాత‌కుడు. త‌న‌తో క‌లిసి దిగిన కొన్ని ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి, ఆమె కాబోయే భ‌ర్త‌కు పంపించాడు. ఈ విష‌యం తెలుసుకున్న ఆ యువ‌తి ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.

ఆదివారం వారి ఇంట్లో నిశ్చితార్థం జ‌ర‌గాల్సి ఉండ‌గా.. ఆమె మ‌ర‌ణంతో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతురాలి పేరు మౌనిక‌. ఎంబీఏ చ‌దివింది.

హైద‌రాబ‌ద్‌లో ఓ ప్రైవేటు సంస్థ‌లో ఉద్యోగం చేస్తోంది. ఆమె తండ్రి సుధాక‌ర్‌.. గిర్మాజీ పేట‌లో కిరాణా షాప్‌ను నిర్వ‌హిస్తున్నారు. మౌనికకు కొద్దిరోజుల కింద‌ట క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన‌ యువకుడితో వివాహం కుదిరింది. అత‌ను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌.

సింగ‌పూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వారిద్ద‌రికీ ఆదివారం గిర్మాజీపేట‌లోని మౌనిక ఇంట్లో నిశ్చితార్థం జ‌ర‌గాల్సి ఉంది. హైదరాబాద్‌లో కారుడ్రైవర్‌గా పనిచేస్తున్న మౌనిక మేనబావ సంతోష్‌కు ఈ విష‌యం తెలిసింది. వేరొక‌రితో పెళ్లి నిశ్చ‌యం కాబోతుండ‌టంతో ప‌గ తీర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

ఆమెతో కలిసి గతంలో దిగిన కొన్ని ఫొటోల‌ను మార్ఫింగ్‌ చేసి కాబోయే వరుడికి పంపించాడు. దీనిపై ఇదివ‌ర‌కే మౌనిక‌ తల్లిదండ్రులు ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేష‌న్‌లో సంతోష్‌పై ఫిర్యాదు చేశారు. సంతోష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జైల్లో పెట్టారు.

నిశ్చితార్థానికి అయిదు రోజుల ముందే సంతోష్ బెయిల్‌పై విడుద‌ల‌య్యాడు. తన నిశ్చితార్థానికి అడ్డంకులు సృష్టిస్తాడనే అనుమానంతో మౌనిక తెల్లవారు జామున ఇంట్లో కిటికీ చువ్వలకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంతేజార్‌గంజ్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంతోష్‌, అత‌ని త‌ల్లిదండ్రుల‌పైనా కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here