హ‌త్య‌కేసులో విచార‌ణ పేరుతో అమ్మాయిని స్టేష‌న్‌కు తీసుకొచ్చి..!

ఓ యువ‌తిపై పోలీసులు దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డారు. ఏకంగా ముగ్గురు పోలీసులు ఆమె ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. పోలీస్‌స్టేష‌న్‌లోకే చిత‌గ్గొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి వెలుగు చూసింది. హ‌ర్యానాలోని సోనిప‌ట్ ర‌యీ పోలీస్‌స్టేష‌న్‌లో కింద‌టి నెల 18వ తేదీన ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఈ వీడియో బ‌హిర్గ‌తం కాగానే పోలీసులు విచార‌ణ‌కు ఆదేశించారు. ఆ యువ‌తి పేరు సంజ‌నా (పేరుమార్చాం). ర‌యీ గ్రామానికి చెందిన సంజ‌న త‌న క‌జిన్ రాహుల్‌తో క‌లిసి బైక్‌పై వెళ్తుండ‌గా.. గ్రామం శివార్ల‌లో సోనూ అనే యువ‌కుడు అడ్డుకున్నాడు. ఈ సంద‌ర్భంగా రాహుల్‌, సోను మ‌ధ్య గొడ‌వ చోటు చేసుకుంది.

అదే గ్రామానికి చెందిన సోను, రాహుల్ స్నేహితులే. ఇద్ద‌రి మ‌ధ్యా కొంత‌కాలంగా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ గొడ‌వ సంద‌ర్భంగా రాహుల్‌.. క‌త్తితో పొడిచి సోనును హ‌త్య చేశాడు. దీనికి సంజ‌న ప్ర‌త్య‌క్ష సాక్షి ఈ ఘ‌ట‌న త‌రువాత స్థానికులు రాహుల్‌ను ప‌ట్టుకుని ర‌యీ పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ కేసులో సంజ‌న ప్ర‌త్య‌క్ష సాక్షి కావ‌డంతో ఆమెను విచార‌ణ పేరుతో పోలీస్‌స్టేష‌న్‌కు పిలిపించారు. విచార‌ణ చేస్తున్న స‌మ‌యంలో- సంజ‌నను కొట్టారు.

ముగ్గురు పోలీసులు ఆమెను విచారించిన‌ట్లు చెబుతున్నారు. సంజ‌న‌ను కొడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒక‌టి శనివారం వెలుగు చూసింది. దీనితో సోనిప‌ట్ పోలీసులు విచార‌ణ‌కు ఆదేశించారు. సంజ‌న‌ను పోలీస్‌స్టేష‌న్‌కు పిలిపించిన మాట వాస్త‌వ‌మేన‌ని, ఆమెను కొట్టలేద‌ని ర‌యీ పోలీసులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here