ఉరి వేసుకుని నిర్జీవంగా వేలాడుతున్నా..ల‌వ‌ర్ ప‌డి ప‌డీ న‌వ్వుతూనే ఉంది!

హైద‌రాబాద్‌: ప్రేమ విఫ‌లం కావ‌డంతో ఓ యువ‌కుడు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయికి వాట్స‌ప్ ద్వారా వీడియో కాల్ చేసి..లైవ్‌లో అత‌ను ఉరి వేసుకున్నాడు. బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. త‌న క‌ళ్ల ముందే అత‌ను ఉరి వేసుకుంటున్న‌ప్ప‌టికీ.. ఆ యువ‌తి మాత్రం దీన్ని సీరియ‌స్‌గా తీసుకోలేదు.

అత‌నేదో త‌మాషా చేస్తున్నాడ‌నుకుంది. ప‌డీ ప‌డీ న‌వ్వుతూనే క‌నిపించింది. త‌న స్నేహితురాలికి కూడా ఈ వీడియోను చూపించింది. ఈ విషాద‌కర ఘ‌ట‌న హైద‌రాబాద్ మ‌ల్కాజ్‌గిరిలో చోటు చేసుకుంది. మృతుడి పేరు సాగ‌ర్‌. మ‌ల్కాజ్‌గిరిలోని వినాయ‌క్ న‌గ‌ర్‌లో త‌న సోద‌రితో క‌లిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా అత‌ను ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.

దీన్ని ఆమె తిర‌స్క‌రించింది. ఇంట్లో కూడా ఈ విష‌యాన్ని చెప్ప‌డంతో యువ‌తి త‌ర‌ఫు బంధువులు, కుటుంబీకులు అత‌ణ్ణి హెచ్చ‌రించారు. సాగ‌ర్ ఇంట్లో కూడా అత‌ని ప్రేమ వ్య‌వ‌హారం తెలియ‌డంతో వారు కూడా స అత‌నికి పెళ్లి సంబంధాన్ని చూడ‌సాగారు. దీనితో తీవ్ర మ‌న‌స్తాపానికి లోనయ్యాడు.

ఆత్మ‌హ‌త్య చేసుకోబోతున్న‌ట్టు తాను ప్రేమించిన అమ్మాయికి వాట్స‌ప్ ద్వారా మెసేజ్ చేశాడు. త‌న చావును క‌ళ్లారా చూడాలంటే వీడియో కాల్ చేయాల‌ని సూచించాడు. ఆమె సాగ‌ర్‌కు వీడియో కాల్ చేసింది. ఆ వెంట‌నే సాగర్‌.. ఆమె క‌ళ్ల ముందే వీడియో కాల్‌ మాట్లాడుతూనే సీలింగ్‌ ఫ్యాన్‌కి ఊరేసుకుని తనువు చాలించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here