రెండు రోజుల కింద‌టే కొన్న కొత్త బైకే ఇలా ఉంటే..ఇక బైక‌ర్ ప‌రిస్థితి?

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న‌ది ఓ ఖ‌రీదైన బైక్‌. మంట‌ల్లో మాడి మ‌సైంది. బైక్ ఇలా ఉంటే ఇక దాన్ని న‌డిపిన బైక‌ర్ ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నే అనుమానం త‌లెత్త‌క మానదు. ఈ బైక్‌తో పాటు అత‌నూ బుగ్గి పాల‌య్యాడు. అదుపు త‌ప్పిన ఓ కారు బైక్‌ను ఢీ కొట్టిన ఘ‌ట‌న‌లో క‌నిపించిన దృశ్యం ఇది. క‌ర్ణాట‌క‌లోని ఉడుపి జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడి పేరు పునీత్ పూజారి.

బైండూర్ స‌మీపంలోని త‌గ్గ‌ర్స కు చెందిన పునీత్‌.. త‌న బైక్‌పై కుందాపురా వైపు వెళ్తూ 66వ నంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై ఓ కారుకు వెనుక‌వైపు నుంచి ఢీ కొట్టాడు. ఈ ఘ‌ట‌న‌లో మంట‌లు చెల‌రేగాయి. బైక్ బుగ్గిపాలైంది. పునీత్ కూడా మంట‌ల బారిన ప‌డ్డాడు. బైక్ ట్యాంక్ ప‌గిలి పెట్రోల్ ఎగ‌జిమ్మింది.

వాటితో పాటు మంట‌లు పునీత్‌ను చుట్టుముట్టాయి. మంట‌లు అంటుకుని అత‌ను తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లో మ‌ర‌ణించాడు. ఈ ఘ‌ట‌న‌పై గంగూళ్లి పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఇష్ట‌ప‌డి కొనుగోలు చేసిన ఖ‌రీదైన స్పోర్ట్స్ బైక్‌.. అత‌ని ప్రాణం తీసిందంటూ కుటుంబ స‌భ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here