ల‌వ‌ర్ అడిగింద‌ని కాదు గానీ.. భారీ చెట్టెక్కి, చిటారుకొమ్మ‌కు చేరుకున్నాడు..ప‌ట్టు త‌ప్పాడు!

వీకెండ్ కావ‌డంతో త‌న ఇద్ద‌రు స్నేహితుల‌తో క‌లిసి స‌ర‌దాగా ఓ పార్క్‌కు వెళ్లాడో యువ‌కుడు. మొబైల్‌లో ఫొటోల‌ను క్లిక్ చేస్తుండ‌గా.. ఓ పేద్ద చెట్టు మీద త‌ల‌కిందులుగా వేలాడుతున్న గ‌ద్ద క‌నిపించింది.

గాలి ప‌టాల‌ను ఎగుర‌వేయ‌డానికి ఉప‌యోగించే దారం అది. ఆ దారం కాళ్ల‌కు చుట్టేసుకోవ‌డంతో ఎగ‌ర‌లేక‌, త‌ల‌కిందులుగా వేలాడుతూ అవ‌స్థ‌లు ప‌డుతూ క‌నిపించిందా గ‌ద్ద‌.

పాపం అనిపించిందా యువ‌కుడికి. దాన్ని ర‌క్షించాల‌నుకున్నాడు. ఆ చెట్టెక్కేశాడు. సుమారు 25 అడుగుల ఎత్త వ‌ర‌కూ వెళ్లాడు. ఇంకొంత పైకెళ్లాల్సి ఉంది.

ఎక్కే ప్ర‌య‌త్నంలో ప‌ట్టుత‌ప్పాడు. చిటారుకొమ్మ కావ‌డంతో అత‌ని బ‌రువును త‌ట్టుకోలేక కిందికి వంగ‌డంతో ఆ యువ‌కుడు స‌ర్రుమ‌ని జారుకుంటూ 25 అడుగుల ఎత్తు నుంచి ధ‌బ్బుమంటూ కిందికి ప‌డ్డాడు.

ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులోని లాల్‌బాగ్‌లో చోటు చేసుకుంది. ఆ యువ‌కుడి పేరు..సునీల్‌. బెంగ‌ళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. కింద‌ప‌డి గాయ‌ప‌డ్డ అత‌ణ్ణి వెంట‌నే స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతున్నాడు. అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని డాక్ట‌ర్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here