ఈ వ‌ధూవ‌రులిద్ద‌రూ మూగ‌వారే!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న ఇద్ద‌రు వ‌ధూవ‌రులు ఇద్ద‌రూ మూగ‌వారే. ఒక‌రికొక‌రు సైగ‌ల ద్వారా అర్థం చేసుకున్నారు. ఒకరికొక‌రు ఇష్ట‌ప‌డ్డారు. పెద్ద‌ల సాక్షిగా ఒక్క‌ట‌య్యారు. అరుదుగా చెప్పుకొనే ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హ‌వేరి జిల్లాలో చోటు చేసుకుంది.

వ‌ధూవ‌రుల పేర్లు గంగాధ‌ర్‌, ప‌విత్ర‌. ఇద్ద‌రికీ పుట్టుక‌తో మాట‌లు రావు. పుట్టు మూగ‌వారు. అయిన‌ప్ప‌టికీ.. ఉన్న‌త విద్య‌ను చ‌దివారు. త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డ‌గ‌లిగే స్థాయికి చేరుకున్నారు.

హ‌వేరి న‌గ‌రానికి చెందిన గంగాధ‌ర్ ప్ల‌స్ టూ వ‌ర‌కు చ‌దివాడు. ప్రైవేట్‌గా డిగ్రీ చేస్తున్నాడు. త‌న స‌మీప బంధువు ప్రింటింగ్ ప్రెస్‌లో ప‌నిచేస్తున్నాడు. అదే జిల్లా శిగ్గావ్ తాలూకాలోని బంకాపుర గ్రామానికి చెందిన ప‌విత్ర కూడా డిగ్రీ చ‌దువుతోంది.

రెండు కుటుంబాల పెద్ద‌లు వారికి పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకు ఇద్ద‌రూ స‌మ్మ‌తించారు. శుక్ర‌వారం హ‌వేరిలోని క‌ల్యాణ‌మంట‌పంలో వైభ‌వంగా పెళ్లి చేసుకున్నారు. పెద్ద‌ల ఆశీర్వాదాన్ని అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here