పోలీస్ జీపుపైకి ఎక్కి.. వేలెత్తి చూపి, పోలీసుల‌నే బెదిరిస్తూ!

పోలీసులు వ‌స్తున్నారంటే జ‌నంలో కాస్త భ‌యం, బెరుకు క‌నిపిస్తుంది. పోలీస్ జీపు సైర‌న్ వినిపించ‌గానే అల‌ర్ట్ అయిపోతారు జ‌నం. అలాంటిది ఇద్ద‌రు యువ‌కులు ఏకంగా పోలీస్ జీప్‌పై కూర్చుని, త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. వారిద్ద‌రూ అక్కా చెల్లెలు. పోలీస్ జీపుపైకి ఎక్కిన వారిద్ద‌రిలో ఒక‌రు బోనెట్‌పై కూర్చోగా.. ఇంకొక‌రు టాప్‌పైకి ఎక్కారు. మ‌ఠం వేసుకుని కూర్చున్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సీహోర్‌లో ఈ దృశ్యం క‌నిపించింది. జిల్లాలోని ఉల‌ఝ్‌వాన్ గ్రామానికి చెందిన తారాచంద్ అనే వ్య‌క్తి కొద్దిరోజుల కింద‌ట ఆరు ఎక‌రాల స్థ‌లాన్ని కొనుగోలు చేశాడు. ఆ స్థ‌లం త‌న‌దంటూ మంగీలాల్ రాయ్ అనే వ్య‌క్తి న‌కిలీ ద‌స్తావేజులు సృష్టించి, పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అవి న‌కిలీవేన‌ని తేలాయి. అయిన‌ప్ప‌టికీ.. విచార‌ణ పేరుతో తారాచంద్‌ను పోలీస్‌స్టేష‌న్‌కు తీసుకెళ్తుండ‌గా.. అత‌ని ముగ్గురు కుమార్తెలు జీపున‌కు అడ్డుప‌డ్డారు.

త‌మ తండ్రిని వ‌దిలి పెట్టేంత వ‌ర‌కూ జీపును ముందుకు క‌ద‌ల‌నివ్వ‌బోమ‌ని భీష్మించారు. ముగ్గురిలో ఇద్దరు కుమార్తెలు ఏకంగా పోలీస్ జీప్‌పైకి ఎక్కి కూర్చున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైర‌ల్‌గా మారింది. త‌మ స్థ‌లాన్ని మంగీలాల్ రాయ్ క‌బ్జా చేశార‌ని, అత‌నిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆ యువ‌తులు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here