ఆ అందం వెనుక భ‌యంక‌ర విషాదం! ఆ కురుల‌ను ప‌క్క‌కు త‌ప్పిస్తే..ఒక్క సెకెను కూడా చూడ‌లేం!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న యువ‌తి పేరు సోఫియా. సోఫియా సావిల్లాగె. వ‌య‌స్సు 18 సంవ‌త్స‌రాలు. బంగారంలా మెరిసిపోయే మేనిచ్ఛాయ ఆమె సొంతం. అంద‌మైన చిరున‌వ్వు ఆమె ప్ర‌త్యేక‌త‌. మ‌ళ్లీ, మ‌ళ్లీ చూడాల‌నిపించే అందం ఆమెది. ఆ అందం, ఆ చిరు మంద‌హాసం వెనుక వెనుక భ‌యంకర విషాదం దాగి ఉంది.

ఎడ‌మ క‌న్ను మీదుగా కిందికి జారిన కురుల‌ను ప‌క్క‌కు త‌ప్పిస్తే.. ఒక్క సెకెను కూడా ఆమె ముఖారంవిందాన్ని మ‌నం చూడ‌లేం. కార‌ణం.. ఆమె ఎడ‌మ క‌న్ను. ఆమె ఎడ‌మ కంటికి ట్యూమ‌ర్ సోకింది. టెన్నిస్ బాల్ సైజులో పెరిగిన ఆ ట్యూమ‌ర్‌ను త‌న కురుల‌తో క‌ప్పి పుచ్చుకుంటూ జీవితాన్ని గ‌డుపుతోందా యువ‌తి.

ఫిలిప్పీన్స్‌లోని బుటువాన్‌లో త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి నివ‌సిస్తున్నారు. ఏడునెల‌ల కింద‌టి వ‌ర‌కు ఆమెకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. ఆ త‌రువాత బ్ల‌డ్-షూట్‌కు గురైందామె ఎడ‌మ‌క‌న్ను. దీని ప్ర‌భావంతో ఎడ‌మ‌కంటి రెటీనా ఉబ్బిపోవ‌డం మొద‌లు పెట్టింది. ఏడు నెల‌ల వ్య‌వ‌ధిలో అది టెన్నిస్‌బాల్ సైజులో పెరిగింది.

దీన్ని రెటినో బ్లాస్టోమా లేదా మెడెల్లాయిపిథెలియోమా అంటార‌ట. రెటీనో బ్లాస్టోమా సోకిన‌ప్ప‌టి నుంచీ ఆమె కంటి చూపు మంద‌గించింది. కుడికంటికి మాత్రం ఇబ్బందులు రాలేదు. క్ర‌మంగా ఎడ‌మ‌క‌న్ను క‌న్నుగా లేదు. టెన్నిస్‌బాల్ సైజులో ఉబ్బిపోయింది. దీనికి వైద్యం చేయించుకునేంత‌టి ఆర్థిక స్థోమ‌త ఆమెకు లేదు.

రెటీనో బ్లాస్టోమా అనేది కంటికి అరుదుగా సోకే కేన్స‌ర్‌. యూకే, అమెరికా, బ్రిట‌న్ దేశాల్లో ఈ కేన్స‌ర్‌ను గుర్తించారు. బ్రిట‌న్‌లో ఏటా 50 మంది చిన్నారులు దీని బారిన ప‌డుతుంటారు. అమెరికాలో ఈ సంఖ్య 300 వ‌ర‌కు ఉంటోంది. యూకేలో ఈ కేన్స‌ర్ సోకిన 98 శాతం మంది చిన్నారుల‌కు శ‌స్త్ర చికిత్స విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు డాక్ట‌ర్లు. ఆమె ఆరోగ్య స్థితి, జీవన విధానంపై `మెయిల్ ఆన్‌లైన్‌` ఓ ప్ర‌త్యేక క‌థనాన్ని రాసింది. ఫొటోల‌ను ప్ర‌చురించింది.

ఫొటో క్రెడిట్స్ : మెయిల్ ఆన్‌లైన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here