రోడ్డు ప‌క్క‌న‌..చెట్ల పొద‌ల్లో: ఉలిక్కిప‌డ్డ పోలీసులు

జైపూర్‌: రోడ్డు ప‌క్క‌న, చెట్ల పొద‌ల్లో ఓ యువ‌తి మృత‌దేహం క‌నిపించ‌డంతో వాహ‌న‌దారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ స‌మాచారాన్ని పోలీసుల‌కు తెలియ‌జేశారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహం ప‌డి ఉన్న స్థ‌లాన్ని చూసి ఉలిక్కిప‌డ్డారు.

రోడ్డుకు కేవ‌లం ఫ‌ర్లాంగు దూరంలోనే మృత‌దేహం ప‌డి ఉంది. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని దౌసా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని సికింద‌రా-శ్రీ‌గంగాపూర్ రోడ్డుపై ఉన్న రామ్‌గ‌ఢ్ గ్రామం శివార్ల‌లో ఈ మృత‌దేహం క‌నిపించింది.

యువ‌తి ధ‌రించిన దుస్తుల‌ను బ‌ట్టి చూస్తే.. స్థానిక యువ‌తి కాద‌ని చెబుతున్నారు. యువ‌తిని హ‌త్య చేసి ఉంటార‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డానికి ఆస్కారం లేద‌ని అంటున్నారు.

ఎందుకంటే.. యువ‌తి స్థానికురాలు కాక‌పోవ‌డం వ‌ల్ల గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వేరే ప్రాంతంలో ఆమెను హ‌తమార్చి, మృత‌దేహాన్ని రామ్‌గ‌ఢ్ శివార్ల‌లోకి తీసుకొచ్చి ప‌డేసి ఉంటార‌ని అంటున్నారు. ఆ యువ‌తి ఎవ‌రో ఇంకా గుర్తు ప‌ట్టాల్సి ఉంద‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here