ప్రియుడితో వెళ్లిపోయిన యువ‌తిని ప‌ట్టుకొచ్చి..మత్తు ఇంజెక్ష‌న్లు ఇచ్చి!

ప్రియుడితో పెళ్లి చేసుకోవ‌డానికి ఇంట్లోంచి వెళ్లిపోయిన ఓ యువ‌తిని వెదికి ప‌ట్టుకొచ్చారు కుటుంబీకులు. మూడు ఇంజెక్ష‌న్లు ఇచ్చి మ‌రీ.. ఆమెను మ‌త్తులోకి దింపారు.

45 సంవ‌త్స‌రాల వ్య‌క్తికి ఇచ్చి బ‌ల‌వంతంగా క‌ట్ట‌బెట్టారు. త‌న‌కీ పెళ్లి వ‌ద్దంటూ నెత్తీ, నోరు బాదుకుంటున్నా వినిపించుకోలేదు. ఆ వ్య‌క్తికి ఇచ్చి రెండో పెళ్లి జ‌రిపించారు.

ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని ఖైరువాలా గ్రామంలో చోటు చేసుకుంది. ఈ పెళ్లిని ఆ ఊరి స‌ర్పంచ్ ద‌గ్గ‌రుండి జ‌రిపించ‌డం ట్విస్ట్‌. ఖైరువాలా గ్రామానికి చెందిన బాధిత యువ‌తి.. అదే గ్రామానికి చెందిన కిష‌న్ అనే యువ‌కుడిని ప్రేమించింది.

అత‌ణ్ణి పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యిచింది. ఈ విష‌యాన్ని ఇంట్లో చెప్ప‌గా.. అంగీక‌రించ‌లేదు. రెండు కుటుంబాల మ‌ధ్య గొడ‌వ‌లు చెల‌రేగాయి. దీనితో ప్రేమికులిద్ద‌రూ పారిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఊరి నుంచి వెళ్లిపోయారు. ఈ విష‌యం తెలిసిన త‌రువాత ఆ ఊరి స‌ర్పంచ్ జ‌యేంద్ర సింగ్ త‌న మ‌నుషుల‌ను పంపించి మ‌రీ.. వారిని ప‌ట్టుకున్నాడు.

త‌ల్లిదండ్రుల ఇష్టానికి అనుగుణంగా 45 సంవ‌త్స‌రాల వ్య‌క్తికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సంద‌ర్భంగా ఆమె ప్ర‌తిఘ‌టించ‌కుండా ఉండ‌టానికి మూడు మ‌త్తుమందు ఇంజెక్ష‌న్లు ఇచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here