కాళ్ల‌పై ప‌డ్డ అభిమాని..దీనికి ప్ర‌తిగా ధోనీ ఏం చేశారంటే..!

ల‌క్నో: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడో వీరాభిమాని. అమాంతం ఆయ‌న కాళ్ల‌పై ప‌డిపోయాడు. పాదాల‌ను ముద్దాడాడు. అత‌ణ్నిలేపి గుండెల‌కు హ‌త్తుకున్నాడు మ‌హేంద్రుడు. అయిన‌ప్ప‌టికీ.. ఆ అభిమాని వినిపించుకోలేదు. వెళ్తూ, వెళ్తూ మ‌రోసారి కాళ్ల‌పై ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న ల‌క్నోలో చోటు చేసుకుంది.

ధోని చేతుల మీదుగా బహుమతి అందుకోవడానికి వేదికపైకి వచ్చిన ఆ అభిమాని వస్తూ వస్తూనే ధోని కాళ్ల మీద పడ్డాడు. ఆయ‌న పాదాల‌ను ముద్దాడాడు. ఏ మాత్రం ఊహించ‌ని ఆ ఘ‌ట‌న‌తో ధోని ఆశ్చ‌ర్య‌పోయాడు.

 

ఆ కుర్రాడ్ని పైకి లేపి, కౌగిలించుకున్నాడు. ప‌నిలో ప‌నిగా సెల్ఫీ దిగాడు. ఓ బ్యాట్‌ను బహుమతిగా అందజేశాడు. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వెళ్తూ, వెళ్తూ..మ‌రోసారి ధోనీ కాళ్ల మీద ప‌డ్డాడు. దీనితో బ‌ల‌వంతంగా అత‌ణ్ని ప‌క్క‌కు తీసుకెళ్లాల్సి వ‌చ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here