న‌వ‌దంప‌తుల బెడ్‌రూమ్ దృశ్యాల‌ను కిటికీ నుంచి సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రిస్తూ..!

న‌వ‌దంప‌తుల బెడ్‌రూమ్ దృశ్యాల‌ను సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రిస్తూ అడ్డంగా బుక్ అయ్యాడో యువ‌కుడు. అత‌ని మొబైల్ ఫోన్ నిండా సెక్స్ టేపులు, వీడియో క్లిప్పింగులే క‌నిపించాయి. ఆ ప‌ర్వ‌ర్టెడ్‌ను ప‌ట్టుకున్న స్థానికులు పోలీసుల‌కు అప్ప‌గించారు. అత‌ని మొబైల్‌ఫోన్‌లో ఉన్న వీడియోల ఆధారంగా అత‌నిపై కేసు న‌మోదు చేశారు.

ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని బెళ‌గావి జిల్లా అదే తాలూకా ప‌రిధిలోని పీర‌న‌వాడి గ్రామంలో చోటు చేసుకుంది. నెల‌రోజుల కింద‌ట పెళ్ల‌యిన ఓ జంట సుధాక‌ర్ గౌడ‌, రాధిక (పేర్లుమార్చాం) పీర‌న‌వాడి గ్రామంలో అద్దె ఇంట్లో నివాసం ఉండ‌సాగారు. వారి పొరుగింట్లోనే ఉండే సునీల్ అనే యువ‌కుడి క‌న్ను వారిపై ప‌డింది.

ఓ చిన్న‌గ్రామం కావ‌డం, పొరుగిల్లే కావ‌డంతో అత‌ని ఆకృత్యానికి అడ్డు లేకుండా పోయింది. త‌ర‌చూ అత‌ను సుధాక‌ర్ గౌడ‌, రాధిక బెడ్‌రూమ్ దృశ్యాల‌ను త‌న కెమెరాలో బంధించేవాడు. శ‌నివారం మ‌ధ్యాహ్నం కూడా అత‌ను కిటికీ గుండా త‌న మొబైల్ ఫోన్ ద్వారా అదే ప‌ని చేస్తుండ‌టాన్ని చూసిన సుధాక‌ర్..అత‌ణ్ని ప‌ట్టుకున్నాడు.

సునీల్ మొబైల్ ఫోన్‌లో చూడ‌గా.. అన్నీ సెక్స్ క్లిప్పింగులు క‌నిపించాయి. సుధాక‌ర్ ఈ విష‌యాన్ని త‌న బంధువులు, స్నేహితుల‌కు తెలియ‌జేశాడు. వారు సుధాక‌ర్‌ను బంధించి, బెళ‌గావి రూర‌ల్ పోలీస్‌స్టేస‌న్‌లో అప్ప‌గించారు. త‌మ విచార‌ణ‌లో నిందితుడు నేరాన్ని అంగీక‌రించాడ‌ని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here