సివిల్ ఇంజినీర్ బ్లాగ్‌స్పాట్‌..దాన్నిండా హీరోయిన్ల మార్ఫింగ్ చేసిన న‌గ్న ఫొటోలే..

హైద‌రాబాద్‌: సినీతార‌ల ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్‌ చేసి, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న కేసులో హైద‌రాబాద్ సీఐడీ అధికారులు బుధవారం ఓ సివిల్‌ ఇంజినీర్‌ను అరెస్టు చేశారు. అత‌గాడి పేరు ర‌ఘువ‌ర‌న్‌. హైద‌రాబాద్ బోడుప్ప‌ల్‌కు చెందిన యువ‌కుడు. మంచి చ‌దువు చ‌దువుకున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మంచి జీతాన్ని తీసుకుంటున్నాడు.

అది స‌రిపోన‌ట్టుంది. అందుకే ఆన్‌లైన్ ద్వారా ఇంట్లో కూర్చునే ఆదాయాన్ని ఆర్జించాల‌ని అనుకున్నాడు. ఇంట‌ర్‌నెట్‌లో ఓ బ్లాక్‌స్పాట్‌ను ఓపెన్ చేశాడు. హీరోయిన్ల ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి.. అందులో పోస్ట్ చేసేవాడు.

దాన్ని చూడ్డానికి వ‌చ్చే ఆన్‌లైన్ సంద‌ర్శ‌కులు క్లిక్స్ ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఈ వ్య‌వ‌హారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కు తెలిసింది. వారు ఊరుకుంటారా? అస‌లే ప‌లుకుబ‌డి ఎక్కువ.

వెంట‌నే వారు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. వారు ఈ కేసును సీఐడీకి బ‌ద‌లాయించారు. రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు.. బుధవారం నిందితుడిని అరెస్టు చేశారు. రిమాండ్‌కు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here