ప్రియురాలితో పెళ్లి కోసం ఒత్తిడి తెచ్చిన త‌ల్లిదండ్రులు! కాద‌న‌లేక‌..కాటికెళ్లాడు!

మైసూరు: ప్రియురాలితో క‌లిసి పెళ్లి పీట‌లు ఎక్కాల్సిన యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. త‌మ కుమార్తెను త్వ‌ర‌గా పెళ్లి చేసుకోవాలంటూ ఆమె త‌ల్లిదండ్రులు ఒత్తిడి తీసుకుని రావ‌డం, ఏకంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన యువ‌కుడు ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు.

ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని మైసూరు స‌మీపంలోని క్యాత‌మార‌న‌హ‌ళ్లిలో చోటు చేసుకుంది. మృతుడి పేరు దీప‌క్‌. 23 సంవ‌త్స‌రాల దీప‌క్ త‌న గ్రామానికే చెందిన అనిత అనే యువ‌తిని ప్రేమించాడు. రెండేళ్లుగా వారి ప్రేమ వ్య‌వ‌హారం కొన‌సాగుతోంది.

త‌మ కుమార్తెను దీప‌క్‌కు ఇచ్చి పెళ్లి చేయ‌డానికి అనిత త‌ల్లిదండ్రులు కూడా అంగీక‌రించారు. పెళ్లి కోసం అనిత త‌ల్లిదండ్రులు కొంత‌కాలంగా దీప‌క్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. అత‌ను దాట వేస్తుండ‌టంతో ఉద‌య‌గిరి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు దీప‌క్‌ను పోలీస్‌స్టేష‌న్‌కు పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. పెళ్లి తేదీని కూడా ఫిక్స్ చేసేశారు.

తాను ఇప్పుడే పెళ్లి చేసుకోవాల‌నుకోవ‌ట్లేద‌ని, క‌నీసం రెండేళ్ల గ‌డువు కావాల‌ని దీప‌క్ వారిని కోరాడు. అయిన‌ప్ప‌టికీ.. వినిపించుకోలేదు. పెళ్లి తేదీ కూడా నిర్ణ‌యించ‌డంతో మ‌న‌స్తాపానికి గురైన అత‌ను ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. దీనిపై దీప‌క్ త‌ల్లిదండ్రులు..అనిత‌పై, ఆమె త‌ల్లిదండ్రుల‌పై పోలీసు కేసు పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here