ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నానంటూ వాట్స‌ప్ కాల్ చేసిన ప్రియుడు.. `ఐ డోన్ట్ మైండ్‌` అంటూ రిప్ల‌య్!

కొన్నాళ్ల పాటు ప్రేమించి, దూర‌మైన త‌న ప్రియురాలికి వాట్స‌ప్ కాల్ చేశాడు ఆమె ప్రియుడు. తాను ఆత్మ‌హ‌త్య చేసుకబోతున్నాన‌ని చెప్పాడు. చెప్ప‌డ‌మే కాదు, ఫ్యాన్‌, దానికి వేలాడ దీసిన ఉరితాడును చూపించాడు. వాటికి సంబంధించిన ఫొటోల‌ను వాట్స‌ప్ చేశాడు. అయిన‌ప్ప‌టికీ.. చ‌లించ లేదా యువ‌తి.

`ఐ డోన్ట్ మైండ్` అంటూ రిప్ల‌య్ ఇచ్చింది. దీనితో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఆ యువ‌కుడు ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులోని తిమ్మ‌య్య రోడ్‌లో చోటు చేసుకుంది. మృతుడి పేరు కెవిన్ ఫ్రెడ‌రిక్‌. వ‌య‌స్సు 21 సంవ‌త్స‌రాలు. ఓ ప్రైవేటు కాలేజీలో హోట‌ల్ మేనేజ్‌మెంట్ కోర్స్ చేస్తున్నాడు.

సురేఖ (పేరుమార్చాం) అనే యువ‌తిని ప్రేమించాడు. కొన్నాళ్ల పాటు వారి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం కొన‌సాగింది. కొద్దిరోజుల నుంచీ సురేఖ అత‌నితో దూరంగా ఉంటున్నారు. దీనికి స‌రైన కార‌ణాలేవీ లేవట‌.

అకార‌ణంగా త‌న‌కు దూరం కావ‌డాన్ని కెవిన్ త‌ట్టుకోలేక‌పోయాడు. బుధ‌వారం సాయంత్రం సురేఖ‌కు వాట్స‌ప్ కాల్ చేశాడు. ఆమెతో చాలా సేపు మాట్లాడాడు. ఛాటింగ్ చేశాడు. తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని అన్నాడు. ఫ్యాన్‌కు త‌గిలించిన ఉరి తాడును కూడా ఫొటో తీసి సురేఖ‌కు పంపించాడు.

ఆమె దీన్ని లైట్‌గా తీసుకున్నారు. ఐ డోన్ట్ మైండ్ చివ‌రిగా రిప్ల‌య్ ఇచ్చారు. దీనితో మ‌న‌స్తాపానికి గురైన కెవిన్‌.. ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై భార‌తీన‌గ‌ర పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. కెవిన్ మృత‌దేహాన్ని పోలీసులు బౌరింగ్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here