ల‌వ్‌..సెక్స్‌..ధోకా..ఎస్కేప్‌!

బెంగ‌ళూరు: ప‌్రేమ పేరుతో యువ‌తిని బుట్ట‌లో వేసుకున్నాడో యువ‌కుడు. ఆమెతో శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఆమె గ‌ర్భం దాల్చ‌డంతో ముఖం చాటేశాడు. ఇప్పుడా యువ‌తి దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరు కేజీ హ‌ళ్లిలో చోటు చేసుకుంది. ముంబైకి చెందిన బాధిత విద్యార్థిని ఉద్యోగరీత్యా కేజీ హ‌ళ్లిలో నివ‌సిస్తున్నారు.

కేజీ హ‌ళ్లిలోని ఓ ప్రైవేట్ సంస్థ‌లో మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తోన్న ఇంజ‌మామ్ ఉల్ హ‌క్ అనే యువ‌కుడితో ఆమెకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌కు దారి తీసింది. ఏడాదికాలంగా వారు స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ట్లు స‌న్నిహితులు చెబుతున్నారు. పెళ్లి చేసుకుంటానని న‌మ్మించి ఆమెతో శారీర‌క సంబంధాన్ని పెట్టుకున్నాడు.

 

ఈ క్ర‌మంలో ఆమె గ‌ర్భం దాల్చారు. ఈ విష‌యం తెలిసిన త‌రువాత ఇంజమామ్ ముఖం చాటేశాడు. మంగ‌ళ‌వారం రాత్రి కేజీ హ‌ళ్లిలో బాధిత యువ‌తి నివాసంపై ఇంజ‌మామ్ కుటుంబీకులు దాడి చేశారు. ఆమెను బెదిరించారు. వెంట‌నే బెంగ‌ళూరు వ‌దిలి వెళ్లిపోవాల‌ని, లేదంటే చంపేస్తామ‌ని హెచ్చ‌రించారు.

దీనిపై బాధితురాలు కేజీహ‌ళ్లి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఆమె ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఇంజ‌మామ్ ఇంటికి వెళ్ల‌గా.. అప్ప‌టికే వారు ఖాళీ చేసి వెళ్లిపోయార‌ని తేలింది. దీనితో బాధితురాలు దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here