ప్రియురాలితో వాట్సప్ లో వీడియో కాల్ మాట్లాడుతూ షూట్ చేసుకున్నాడు.. 80 మిస్డ్ కాల్స్..!

పాట్నాకు చెందిన ఓ యువకుడు తన ప్రేయసితో వాట్సప్ లో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. అతడి వయసు 19 సంవత్సరాలే.. అంతలోనే సెమి-ఆటోమేటిక్ పిస్టల్ తో కాల్చుకొని చనిపోయాడు. ఆ అమ్మాయితో రిలేషన్ షిప్ ఎక్కడ ముగిసిపోతుందో అన్న బాధతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. 19 సంవత్సరాల ఆకాష్ తన గర్ల్ ఫ్రెండ్ తో రెండు గంటలుగా వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే చివర్లో ఇంకొద్దిసేపటికి నిద్రపోతారన్న సమయంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆమె వీడియో కాల్ మాట్లాడుతూ ఉండగానే పిస్టల్ ను లోడ్ చేశాడు ఆకాష్. ఆమె దాన్ని పారేయమని అతడితో చెప్పింది. వెంటనే అతడు ఆమె చెప్పినట్లు విన్నాడు. కానీ మరోసారి కూడా గన్ ను లోడ్ చేసిన అతడు ఈసారి ఆమె మాట వినలేదు. అతడు తల మీద గన్ పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మొత్తం ఘటన వీడియో కాల్ లో చోటుచేసుకుంది.

గన్ పేలుడు శబ్దాన్ని విన్న ఆకాష్ కుటుంబసభ్యులు పరిగెత్తుకొని వచ్చారు. కానీ అప్పటికే అతడు చనిపోయి కనిపించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మొబైల్, పిస్టల్, బుల్లెట్ లను సీజ్ చేశారు.

రియలెస్టేట్ వ్యాపారి సంజయ్ సింగ్ కొడుకు అయిన ఆకాష్ సింగ్ ని వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్ళి చేయాలని అనుకున్నారు. కానీ ఆకాష్ వేరే అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. అతడు తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలని భావించాడు. కానీ కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోకపోవడంతో అతడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. దీంతో అతడు వీడియో కాల్ లో తన ప్రాణాన్ని లవర్ ముందు విడిచాడు. ఆకాష్ గర్ల్ ఫ్రెండ్ ఉదయం 3 గంటల వరకూ అతడికి ఫోన్ చేస్తూనే ఉంది. దాదాపు 80 మిస్డ్ కాల్స్ పడ్డాయి. దీంతో ఆమె ఆకాష్ స్నేహితులు సౌరబ్, చందన్ లకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని బయటపెట్టింది. ఆకాష్ తండ్రి సంజయ్ మాత్రం ఆ అమ్మాయితో రిలేషన్ షిప్ గురించి బంధువులు తన కొడుకును తిట్టేవారని అందుకే ఇలా చేశాడని చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here