యూనివ‌ర్శిటీ విద్యార్థినితో ఎక‌సెక్కాలా?

యూనివ‌ర్శిటీ విద్యార్థినితో ఎక‌సెక్కాలు ఆడాడో యువ‌కుడు. క్లాసుల‌కు వెళ్తోన్న ఆమెను అడ్డ‌గండి ఆట ప‌ట్టించాడు. టీజ్ చేశాడు.

లైంగికంగా వేధించ‌డం మొద‌లు పెట్టాడు. ఏడుస్తూ, త‌ల వంచుకుని అవ‌త‌లికి వెళ్ల‌లేదా విద్యార్థిని. అత‌ని కాల‌ర్ ప‌ట్టుకుంది. ఆ దృశ్యాన్ని చూసిన తోటి విద్యార్థులు అక్క‌డికి చేరుకున్నారు.

ఆ యువ‌కుడిని ప‌ట్టుకుని దేహ‌శుద్ధి చేశారు. మోకాళ్ల‌పై కూర్చోబెట్టి గుంజీలు తీయించారు. ఈ ఘ‌ట‌న ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌లోని ఉత్క‌ళ యూనివ‌ర్శిటీలో చోటు చేసుకుంది.

ఆ యువ‌తి పేరు సుశాంత్ సేథి. భువ‌నేశ్వ‌ర్‌లోని భోయ్‌న‌గ‌ర్ నివాసి. అత‌ను కూడా విద్యార్థేన‌ట‌. ఉత్క‌ళ యూనివర్శిటీ ఆవ‌ర‌ణ‌లోకి వెళ్లి, త‌ర‌చూ ఇలా విద్యార్థినుల‌ను ఏడిపిస్తుంటాడ‌ని చెబుతున్నారు. అత‌ణ్ణి పోలీసుల‌కు ప‌ట్టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here