ప‌బ్‌లో డీజే ప్లే చేస్తోన్న పాట మార్చాల‌ని కోర‌డ‌మే అత‌ని త‌ప్ప‌యింది..!

న్యూఢిల్లీ: ప‌బ్‌లో ప‌నిచేసే ఓ డిస్క్ జాకీ ఆలియాస్ డీజే.. దారుణ కృత్యానికి పాల్ప‌డ్డాడు. ప‌బ్‌కు వ‌చ్చిన ఓ యువ‌కుడిని హ‌త్య చేశాడు. దీనికి కార‌ణం- అత‌ను పాట మార్చ‌మ‌ని కోర‌డ‌మే. ఫ‌లానా పాట బాగోలేద‌ని, వేరే పాటను ప్లే చేయాలంటూ కోరిన ఓ యువ‌కుడిని క‌త్తితో పొడిచి చంపాడు. ఈ ఘ‌ట‌న దేశ రాజ‌ధానిలోని పంజాబీ బాగ్‌లో చోటు చేసుకుంది.

హంత‌కుడి పేరు దీప‌క్ వ‌రిష్ఠ్ ఆలియాస యూరీ. పంజాబీ బాగ్‌లోని ర‌ఫ్తార్ ప‌బ్‌లో డిస్క్ జాకీగా ప‌నిచేస్తున్నాడు. శ‌నివారం రాత్రి విజయ్‌దీప్ అనే యువ‌కుడు త‌న స్నేహితుల‌తో క‌లిసి ర‌ఫ్తార్ ప‌బ్‌కు వెళ్లాడు. ఈ సంద‌ర్భంగా త‌న స్నేహితులతో క‌లిసి డాన్స్ చేశాడు. ఆ స‌మ‌యంలో ప్లే అవుతున్న పాట అత‌నికి న‌చ్చ‌లేదు.

దీనితో ఈ పాట‌ను మార్చి, వేరే రికార్డ్‌ను ప్లే చేయాల‌ని విజయ్‌దీప్ కోరాడు. దీన్ని దీప‌క్ ప‌ట్టించుకోలేదు. విజ‌య్‌దీప్ మరింత గ‌ట్టిగా చెప్పాడు. ఇది కాస్తా ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ‌కు దారి తీసింది. దీప‌క్ వ‌రిష్ఠ్‌, విజ‌య్‌దీప్ పెద్ద ఎత్తున ఘ‌ర్ష‌ణ ప‌డ్డారు. ఒక‌రినొక‌రు తోసుకున్నారు.

దీనితో ఆగ్ర‌హానికి గురైన దీప‌క్ కేక్ క‌ట్ చేసే క‌త్తితో విజ‌య్‌దీప్ గొంతు కోశాడు. అడ్డొచ్చిన అత‌ని స్నేహితులపై మ‌ద్యం బాటిళ్ల‌తో దాడి చేశాడు. అనంత‌రం పారిపోయాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు దీప‌క్ కోసం గాలించారు. సోమ‌వారం ఉద‌యం అత‌ణ్ని అరెస్టు చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here