రెండువారాల కింద‌ట అదృశ్యం..రిసార్టు బావిలో మృత‌దేహం! ఇన్నిరోజులు ఎక్క‌డున్నాడంటూ!

హ‌స‌న్‌: కొద్దిరోజుల కింద‌ట అప‌హ‌ర‌ణ‌కు గురైన ఓ యువ‌కుడు మృత‌దేహ‌మై క‌న‌పించాడు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అత‌ణ్ని హ‌త్య చేసి, మృత‌దేహాన్ని బావిలో ప‌డేశారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్‌లోని వ‌ల్ల‌బ్‌భాయ్ మార్గంలో చోటు చేసుకుంది. మృతుడి పేరు హ‌ర్ష‌. హ‌స‌న్‌లో ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవాడు.

వృత్తిప‌ర‌మైన గొడ‌వ‌లు ఉండేవ‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే కింద‌టి నెల‌లో హ‌ర్ష అదృశ్యం అయ్యాడు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అత‌ణ్ని అప‌హ‌రించారు. త‌మ కుమారుడు క‌నిపించ‌ట్లేదంటూ హ‌ర్ష త‌ల్లిదండ్రులు హ‌స‌న్‌లోని పెన్ష‌న్ మొహ‌ల్లా పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు, కుటుంబ స‌భ్యులు అత‌ని కోసం గాలిస్తున్న స‌మ‌యంలోనే మృత‌దేహం శివార్ల‌లోని హొయ‌స‌ళ రిసార్ట్‌లోని బావిలో తేలింది. ఈ ఘ‌ట‌న‌పై హ‌స‌న్ రూర‌ల్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అదౄశ్య‌మైన త‌రువాత ఇన్ని రోజులు ఎక్క‌డ ఉన్నాడ‌నే విష‌యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here